అవీ ఇవీ

Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది

నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి స్వయంభు (Swayambhu). రెండూ పీరియడ్ పాన్ ఇండియా చిత్రాలే. దాంతో తన దశ తిరుగుతుంది అని భావించింది. కానీ అందులో మొదటి చిత్రం ఫ్లాప్ అయింది.

“నాగబంధం” చిత్రంలో ఈ భామ ద్విపాత్రిభినయం చేసింది. ఆ విధంగా ఆమెకి ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ. ఒక పాత్రకి సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. కొంచెం విలన్ తరహాలో కూడా కనిపిస్తుంది. సినిమా హిట్ అయి ఉంటే ఈ భామకి ఈ పాత్ర ఒక మరుపురానిదిగా ఉండిపోయేది. కానీ మొదటి వీకెండ్ తర్వాత సినిమా చతికిలాపడింది.

“ఇస్మార్ట్ శంకర్” తర్వాత ఈ భామకి మరో హిట్ లేదు. హిట్ కోసం పడుతున్న పరితపన అలాగే కంటిన్యూ అవుతోంది. నాగబంధం’తో కూడా విజయం దక్కాలన్నా ఆశ నెరవేరలేదు.

ఇక మిగిలింది స్వయంభు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్. అతను కూడా హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ సినిమా విడుదల ఇప్పటికే అనేకసార్లు వాయిదాపడింది. పైగా ఇందులో మెయిన్ హీరోయిన్ సంయుక్త. సో, నభాకి ఈ సినిమా హెల్ప్ చేస్తుంది అని చూడాలి. హిట్ ఐతే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. లేదంటే “ఇస్మార్ట్ శంకర్” ఒక్కటే హిట్ గా మిగిలిపోతుంది.

TeluguCinema

Recent Posts

Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…

6 hours ago

Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…

6 hours ago

Sri Gouri Priya: తెలుగు భామకి తెలుగులో కెరీర్ ఊపు వచ్చేనా

శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…

19 hours ago

Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?

తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో  'యానిమల్',…

20 hours ago

Varun Tej ఖాతాలోనే మారుతి తదుపరి చిత్రం

దర్శకుడు మారుతి (Maruthi) ఆ మధ్య తీసిన 'ది రాజా సాబ్' (The Raja Saab) సినిమా ఎంత ఘోరంగా…

20 hours ago

Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?

రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…

2 days ago