రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం “వారణాసి” (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్. ప్రస్తుతం నోలన్ తీసిన “ది ఆడిసీ” (The Odyssey) చిత్రానికి ఉన్న క్రేజ్ చూస్తేనే అర్థం అవుతోంది రాజమౌళి తీస్తున్న “వారణాసి” వంటి చిత్రాల కోసమే నేటి తరం ప్రేక్షకులు ఎక్కువ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఐమాక్స్ ఫార్మాట్ కి ఎక్కువ క్రేజ్ ఉంది.
రాజమౌళి కూడా వారణాసి చిత్రాన్ని imax ఫార్మాట్ లో తీస్తున్నారు. అందుకే “ది ఆడిసీ”లాగే రాజమౌళి సినిమాకి కూడా ఐమాక్స్ స్క్రీన్ లకు యమా డిమాండు ఉంటుంది. ఐతే, అమెరికాలో కూడా ఐమ్యాక్స్ స్క్రీన్ లు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. ఇక మన దేశంలో కూడా ఇంకా తక్కువ ఉన్నాయి.
మరి రాజమౌళి ఏప్రిల్ 7, 2027న ‘వారణాసి’ని విడుదల చేస్తే ఐమాక్స్ స్క్రీన్ల కొరత మరీ అధికంగా ఉంటుంది. ఎందుకంటే
మార్చి 26న Godzilla x Kong: Supernova, ఏప్రిల్ మొదటి వారంలో మరో భారీ హాలీవుడ్ సినిమా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు డేట్ మార్చుకోకపోతే “వారణాసి”కి అమెరికాలో ఐమాక్స్ స్క్రీన్ల విషయంలో పెద్ద ఇబ్బంది.
మరి రాజమౌళి “వారణాసి”ని వాయిదా వేస్తారా?
ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ తుది దశకు చేరుకొంది. సెప్టెంబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి అయ్యేలా ఉంది.
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…
నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…
తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో 'యానిమల్',…
దర్శకుడు మారుతి (Maruthi) ఆ మధ్య తీసిన 'ది రాజా సాబ్' (The Raja Saab) సినిమా ఎంత ఘోరంగా…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…