దర్శకుడు మారుతి (Maruthi) ఆ మధ్య తీసిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందో తెలుసు. ఆయన కి పెద్ద హీరో సినిమా దక్కిందన్న ఆనందం మొత్తం రిలీజ్ తర్వాత ఎగిరిపోయింది. ఎంతో ట్రోలింగ్ కి గురి అయ్యారు. ఆ సినిమా విడుదలకు ముందు ఇది మా సినిమా అని చెప్పుకున్న బ్యాచ్ ఆ తర్వాత ఆ సినిమాతో మాకేంటి సంబంధం అన్నట్లుగా మారిపోయారు. అంత ఘోరమైన అపజయం అది.
అందుకే మారుతితో సినిమాలు చేసేందుకు పెద్ద హీరోలు ఎలాగూ ఆసక్తి చూపరు, మిడ్ – రేంజ్ హీరోలు కూడా ముఖం చాటేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కొత్తవాళ్లతో చేస్తే మారుతి పరువు పోతుంది. అందుకే, వరుణ్ తేజ్ (Varun Tej)ని ఒప్పించినట్లు సమాచారం.
వరుణ్ తేజ్ కి కూడా కెరీర్ ఎదో అలా సాగుతోంది. ఇప్పటికే వరుసగా మూడు ఫ్లాపులు ఇచ్చి “కొరియన్ కనకరాజు” పూర్తి చేసి ఇప్పుడు ఇంకో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ మధ్య తన సోదరి నిహారిక నిర్మించే “బరి” చిత్రం ఒప్పుకున్నాడు. కానీ అది ఇంకా షూటింగ్ మొదలుకాలేదు.
ఇప్పుడు మారుతితో సినిమా చేసేందుకు ఓకె చెప్పినట్లు సమాచారం.
నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…
తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో 'యానిమల్',…
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…