తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో ‘యానిమల్’, ‘ఛావా’ వంటి భారీ హిట్స్ ఉన్నాయి. తెలుగులో పుష్ప సిరీస్ వంటి పాన్ ఇండియా హిట్స్ ఉన్నాయి. ఇటీవలే ఈ భామ హీరో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకొంది.
పెళ్లి తర్వాత కూడా కెరీర్ ని కొనసాగిస్తోంది. ఐతే తెలుగులో ఆమె ఇప్పటివరకు జతకట్టని పెద్ద హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి వారు ఉన్నారు.
ఇప్పుడు వీరితో నటిస్తుందా? ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాల్లో హీరోయిన్లు సెట్ అయ్యారు. ఆ తర్వాత ఒప్పుకునే సినిమాల్లో అవకాశం వస్తుందా అనేది చూడాలి. రామ్ చరణ్ తన తదుపరి చిత్రంగా సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో స్టార్ట్ అవుతుంది. సుకుమార్ కాంబినేషన్ లో ఇప్పటికే ఆమె పుష్ప, పుష్ప 2 సినిమాలు చేసింది. సుకుమార్ మళ్ళీ ఆమెకి అవకాశం ఇస్తాడా?
ఎన్టీఆర్ తదుపరి చిత్రంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చెయ్యనున్నాడు. ఆ సినిమా పూర్తిగా పురాణగాథ. అందులో రష్మికకి అవకాశం రావడం డౌట్. సో, ఈ హీరోలతో రష్మిక నటిస్తుందా అనేది పెద్ద సందేహమే.
నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…
దర్శకుడు మారుతి (Maruthi) ఆ మధ్య తీసిన 'ది రాజా సాబ్' (The Raja Saab) సినిమా ఎంత ఘోరంగా…
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…