ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. ‘బాహుబలి 2’ విడుదల తర్వాత ఇలా చేస్తూ ఉన్నాడు. ఐతే, విడుదల విషయంలో మాత్రమే ఆ దూకుడు ఉండడం లేదు. సెట్స్ ఎప్పుడూ అనేక చిత్రాల షూటింగ్స్ నడుస్తున్నా ఏడాదికి ఒక్క సినిమా విడుదల చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. 2025లో ఐతే హీరోగా ఆయన నటించిన సినిమా రానే లేదు.
ఐతే ఈ ఈఏడాది ఏకంగా రెండు సినిమాలను తీసుకొస్తున్నాడు.
ఈ ఏడాది సంక్రాంతికి ‘రాజాసాబ్’ (The Rajasaab) వచ్చింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వల్ల సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ రిజల్ట్ మాత్రం ఘోరం. కెరీర్ లోనే అత్యంత ఫ్లాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
అందుకే ఇదే ఏడాది ఇంకో సినిమాని విడుదల చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తోన్న ‘ఫౌజీ’ (Fauji) చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలకు సిద్ధం చేశాడు ప్రభాస్. ఈ సినిమా డిసెంబర్ 3న విడుదల కానుంది.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పిరిట్’ (Spirit) సినిమా 2027లో విడుదల అవుతుంది. అంటే 2026లో ప్రభాస్ హీరోగా నటించిన రెండు చిత్రాలు విడుదల అవుతున్నట్లే. 2023లో ఆదిపురుష్, సలార్ సినిమాలు విడుదల చేశాడు. అందులో ఆదిపురుష్ దారుణంగా పరాజయం చెందింది. సలార్ పెద్ద హిట్ అయింది. 2026లో కూడా అదే రిపీట్ కానుందా. ది రాజాసాబ్ ఫ్లాప్ అయింది. సో ఏడాది చివర్లో వస్తోన్న ‘ఫౌజీ’ భారీ హిట్ కావడం ఖాయమేనా?
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…