అవీ ఇవీ

Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి

నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అని ఖరాకండిగా ఉంటోంది. .

ఇటీవల ఆమెకి ఒక పాన్ ఇండియా సినిమా ఆఫర్ వచ్చింది. కానీ ఆ సినిమాకి ఈ భామ నో చెప్పినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

“కేజీఎఫ్” సినిమాతో యష్ సరసన నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ప్రస్తుతం తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల సిద్ధు జొన్నలగడ్డతో “తెలుసుకదా”, నాని సరసన “హిట్ 3” చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి “ఆదర్శ కుటుంబం” (Aadarsha Kutumbam) లో నటిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం శ్రీనిధిని సంప్రదించిన నిర్మాతలు ఆమె రెమ్యునరేషన్ తగ్గించాలని కోరారట. అయితే, అందుకు ఆమె ససేమిరా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన చేతిలో మంచి ప్రాజెక్టులు ఉన్నాయని, పారితోషికంలో రాజీ పడాల్సిన అవసరం లేదని నిర్మాతలకు శ్రీనిధి స్పష్టం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

TeluguCinema

Recent Posts

Prabhas: మూడేళ్ళ తర్వాత ఒకే ఏడాది రెండు చిత్రాలు

ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…

3 hours ago

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి ఉంది: Rakul Preet Singh

బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…

6 hours ago

అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita

అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…

2 days ago

Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!

గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…

2 days ago

Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు

ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…

2 days ago

Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ

రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…

2 days ago