తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) రిలీజ్ అవుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సినిమాకు ఎ-సర్టిఫికేట్ ఇచ్చారు. కాబట్టి 18 ఏళ్ల లోపు పిల్లల్ని ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లకు అనుమతించవద్దని ఎగ్జిబిటర్లకు గట్టిగా చెప్పారు. ఇక టికెట్ రేట్లపై కూడా కఠినంగా ఉన్నారు. క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సి-సెంటర్లలో అనధికారికంగా టికెట్ రేట్లు పెంచుతుంటారు. ఈ సినిమాకు అలాంటి పనులు చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు.
ఈసారి ఇంత కఠినంగా ఉండడానికి కారణం ఒక్కటే. విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. ఏ చిన్న తప్పు జరిగినా, అది ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బందికరం. అందుకే ఇలా టికెట్ రేట్ల విషయంలో, మైనర్లను అనుమతించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని మేకర్స్ నిర్ణయించారు.
తమిళనాడు అంతటా దాదాపు 950 స్క్రీన్లలో ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3000 థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. తమిళనాట ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా స్థానిక యంత్రాంగంతో కలిసి నిర్మాతలు పర్యవేక్షిస్తున్నారు.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…