దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. పెద్ద హీరోలందరూ పూరితో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపేవారు. తమని కొత్తగా చూపిస్తాడని, బాడీ లాంగ్వేజ్ మార్చేస్తాడని వారి నమ్మకం. ఐతే, క్రమంగా పూరి “ట్రాక్” తప్పారు. దాంతో భారీ ఫ్లాప్స్ వచ్చాయి. కోట్ల రూపాయల నష్టం, అప్పులు కూడా చేరాయి.
“లైగర్”తో విజయ్ దేవరకొండ స్టార్డం మొత్తాన్ని తీసిపడేసిన పూరి ఆ తర్వాత రామ్ పోతినేనికి “డబుల్ ఇస్మార్ట్”తో డబుల్ షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు ముందుకు రావడం లేదు. దానికి కారణం… ఆయన పార్ట్నర్ ఛార్మి ఉంటే సినిమా చేయలేమని ఆ హీరోలు తేల్చి చెప్పడమే.
దాంతో, ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమా ఆఫర్ల కోసం ఛార్మికి కటీఫ్ చెప్పనున్నాడని టాక్. అంటే, వాళ్లిద్దరూ విడిపోతారని కాదు. పూరి తీసే సినిమాల్లో ఛార్మి నిర్మాతగా కానీ, ఇతరత్రా కానీ ఇన్వాల్వ్ కాదు.
ఛార్మిని దూరం పెడితేనే సినిమా చేస్తామన్న హీరోలు ఇప్పుడు పూరికి వెంటనే డేట్స్ ఇస్తారా? ఛార్మి ఉన్నా లేకున్నా ప్రధానంగా పూరి చెయ్యాల్సిన పని… అర్ధవంతమైన స్రిప్ట్ రాయడం. అది ముఖ్యం. “లైగర్”, “డబుల్ ఇస్మార్ట్” లాంటి సిల్లీ కథలు, సన్నివేశాలతో ఎవరూ హిట్ కొట్టలేరు.
మరోవైపు, ఛార్మి తన ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవల జిమ్ లో చేరినట్లు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చెయ్యడం విశేషం.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…