బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్, దీపిక పదుకోన్ లది సూపర్ హిట్ జంట. వెండితెరపై వాళ్ళది హిట్ పెయిర్. షారుక్ ఖాన్ సరసన “ఓం శాంతి ఓం”లో నటించి పాపులర్ అయింది దీపిక. ఆ తర్వాత చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, జవాన్, పఠాన్ వంటి అనేక సినిమాల్లో నటించారు. దాదాపుగా అన్నీ హిట్టే.
అందుకే ఇప్పుడు షారుక్ అడగ్గానే ఆయన కొత్త చిత్రంలో అతిథి పాత్ర పోషించేందుకు ఓకె చెప్పింది దీపిక. షారుక్ ఖాన్ హీరోగా, ఆయన కూతురు సుహానా మరో ప్రధాన పాత్రలో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఒక సినిమా తీస్తున్నాడు. “కింగ్” (King) అనే పేరుతో తండ్రి కూతుళ్లతో యాక్షన్ చిత్రం తీస్తున్న ఈ దర్శకుడు ఒక కీలక పాత్ర కోసం దీపికని ఒప్పించాడు.
సిద్ధార్థ్ ఆనంద్ తీసిన మూడు చిత్రాల్లో ఆమె నటించింది. పైగా షారుక్ మూవీ. దాంతో షారుక్ కూతురు సుహానాకి తల్లిగా నటించేందుకు ఆమె అంగీకరించింది.
ఇక నిజజీవితంలో ఇటీవలే ఆమె తల్లి అయింది. ఆమె కూతురికి ఇంకా ఏడాది కూడా నిండలేదు. కానీ మళ్ళీ మేకప్ వేసుకొని షూటింగ్ కి రెడీ అవుతోంది. బాలీవుడ్ లో ఆమె మొదటి చిత్రం షారుక్ తోనే, ఆమె రీ-ఎంట్రీ కూడా షారుక్ తోనే.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…