వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని మరో సక్సెస్ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఇందులో భాగంగా తన కొత్త సినిమా రిలీజ్ కోసం అదిరిపోయే డేట్ లాక్ చేశాడు ఈ హీరో. అదే డిసెంబర్ 28. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీని డిసెంబర్ 28న విడుదల చేయాలని నిర్ణయించారు.
డిసెంబర్ 28 గురువారం పడింది. ఆ తర్వాత శని, ఆదివారం వీకెండ్స్ కలిసొస్తున్నాయి. ఆ వెంటనే జనవరి 1 వస్తోంది. ఇలా లాంగ్ వీకెండ్ తో పాటు సెలబ్రేషన్ మూడ్ కలిసొస్తోంది నాని సినిమాకు. పైగా ఓవర్సీస్ లో ఈ డేట్ బాగా వర్కవుట్ అవుతుంది. ఇక్కడంటే కేవలం 31 రాత్రి మాత్రమే సందడి. అదే విదేశాల్లో అయితే జనవరి 1కు అటు ఇటు చెరో 2 రోజులు వేడుక ఉంటుంది. ఇలాంటి టైమ్ లో ఎంసీఏ విడుదల చేస్తే ఓవర్సీస్ వసూళ్లు బాగా వస్తాయనేది దిల్ రాజు ప్లాన్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. 30శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ మూవీలో నాని సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…