ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’ (OM: Chapter 1) అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.
‘అమరన్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, ఈసారి వినూత్నమైన స్క్రీన్‌ప్లే, భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధనుష్, సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి వంటి స్టార్ తారాగణం కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సినీ అభిమానుల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది.
“మా సినిమా టైటిల్‌ను ‘ఓం: చాప్టర్ 1’గా ఖరారు చేశాం. టైటిల్ ఎంపిక నుంచి నటీనటుల ఎంపిక, తొలి షెడ్యూల్ వరకు ప్రతి దశ విజయవంతంగా పూర్తైంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారు. సెట్స్‌లో అందరి కష్టాన్ని చూస్తుంటే ఇది వారికి ఎంత ప్రత్యేకమైన సినిమా అనేది అర్థమవుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక బృందం పనిచేస్తోంది. ‘అమరన్’, ‘కరుప్పు’ చిత్రాలకు పనిచేసిన కలైవనన్ ఈ చిత్రానికి కూడా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం,” అని అన్నారు దర్శకుడు.
“ఓం: చాప్టర్ 1’ అనే టైటిల్ కేవలం ఆధ్యాత్మికతను సూచించేది మాత్రమే కాదు. ఇందులో అనేక అర్థాలు, ఆసక్తికరమైన కోణాలు దాగి ఉన్నాయి. సినిమా చూసే కొద్దీ ప్రేక్షకులు వాటిని ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను. మా టీమ్‌కు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు,” అని తెలిపారు దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి.
వార్నర్ మ్యూజిక్ గ్రూప్ ఇండియా ప్రతినిధి జై మెహతా మాట్లాడుతూ.. “భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా విశేష ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను. కోలీవుడ్ చరిత్రలోనే అత్యంత గుర్తుండిపోయే చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని నా విశ్వాసం,” అన్నారు.
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…