జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు అయిన జై కృష్ణ ఘట్టమనేని తన మొదటి సినిమా విశేషాలు పంచుకున్నారు.
హీరో కావాలని ఎప్పుడు అనుకున్నారు? మీ బాబాయి మహేష్ బాబు సపోర్ట్ ఉందా?
“చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. టీనేజ్ లోనే నటుడి అవ్వాలని ఫిక్స్ అయ్యా. రెండేళ్లు ముంబైలో, తర్వాత పాండిచ్చేరిలో, రెండేళ్లు న్యూయార్క్ లో శిక్షణ తీసుకున్నాను. దర్శకుడు అజయ్ గారు మూడు నెలల పాటు వర్క్‌షాప్ చేయించారు. నిర్మాత జెమినీ కిరణ్ గారు అజయ్ గారిని పరిచయం చేశారు. అలా ఈ సినిమా మొదలైంది. ఇంతకుముందు కూడా నేను కొన్ని కథలు విన్నాను. కాకపోతే అజయ్ గారు చెప్పిన కథ చాలా అద్భుతంగా అనిపించింది.
మొదటి చిత్రంతోనే వైజయంతి మూవీస్ లాంటి ప్రతిష్టాత్మకతో పని చెయ్యడం అదృష్టం. మహేష్ బాబాయ్ గారి తొలి సినిమా కూడా వైజయంతి మూవీస్‌లోనే వచ్చింది. నేను ఈ సినిమా చేస్తున్నానని తెలియక ముందే ఘట్టమనేని అభిమానులు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి. మంచి కథలు, మంచి పాత్రలు చేయాలనే ఆలోచన నాకు మొదటి నుంచే ఉంది. మహేష్ బాబాయ్ ప్రతి విషయంలో గైడెన్స్ ఇస్తారు. ఆయన ఆయన సినిమా కూడా చూశారు. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. “
ఈ సినిమా గురించి, పాత్ర గురించి, హీరోయిన్ గురించి చెప్పండి?
ఇందులో నా పాత్ర పేరు శ్రీను. హీరోయిన్ పాత్ర పేరు మంగ. ప్రేమకథే కానీ ఇది చాలా కొత్తగా ఉంటుంది. సినిమా రియలిస్టిక్‌గా ఉంటుంది, టెంప్లేట్ లవ్ స్టోరీ కాదు. ట్విస్టులు కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఇక రాషా తడానీ ఇప్పటికే బాలీవుడ్ లో నటించింది. ఆమెతో నటించడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఆమెని కూడా తెలుగువాళ్లు ఆదరిస్తారు అనుకుంటున్నాను.
మీ నాన్నగారు మీకు చిన్నప్పుడు ఏమైనా చెప్పేవారా?
ఆయన చాలా సినిమాలు చూసేవారు. చిన్నప్పుడు నేను సినిమా వాతావరణానికి దూరంగా ఉండి చదువుకునేవాడిని. మొదటిసారి ‘నిజం’ సినిమా షూటింగ్‌కు వెళ్లాను. అందులో చైల్డ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత ‘అర్జున్’ సినిమా షూటింగ్‌కు వెళ్లాను. ఆ తర్వాత ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్‌కు వెళ్లాను.
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…