విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా నటించింది. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
నాగబంధంలో మీ పాత్ర ఏంటి?
ఇందులో నేను పార్వతి అనే పాత్రలో కనిపిస్తాను. తను ఒక వేద విద్యార్థిని. ఇప్పటివరకు ఇలాంటి పాత్ర నేను చేయలేదు. తన కుటుంబం కోసం, ప్రేమ కోసం ఎంతవరకైనా నిలబడే వ్యక్తిత్వం ఆమెది. పార్వతి తీసుకునే ప్రతి నిర్ణయం కథపై ప్రభావం చూపుతుంది. నా పాత్ర చూసి ప్రేక్షకులు తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు.
ఇందులో ఒక పాట గురించి అందరూ మాట్లాడుతున్నారు…
అవును.. ఆ పాట చేయడం నిజంగా అద్భుతమైన అనుభవం. దాదాపు 5,000 మంది డ్యాన్సర్లతో ఆ పాటను గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అందులో క్లాసికల్ డాన్స్ కూడా ఉంటుంది. నిజంగా ఆ పాట బిగ్ స్క్రీన్‌పై అద్భుతంగా కనిపిస్తుంది. అలాంటి పాటను నేను ఇప్పటివరకు చేయలేదు. అది నాకు చాలా కొత్త అనుభవం.
టెక్నికల్‌గా కూడా అంత పెద్ద కాన్వాస్‌పై ఆ పాటను చిత్రీకరించడం ఒక ఛాలెంజ్. అది కేవలం డాన్స్ సాంగ్ మాత్రమే కాదు… అందులో భక్తి భావం కూడా కనిపించాలని దర్శకుడు, కొరియోగ్రాఫర్‌కు ముందుగానే సూచించారు. ఆ పాట కోసం వేసిన సెట్ నిజంగా ఒక పండుగ వాతావరణాన్ని గుర్తు చేస్తుంది. బృందావనంలో గోపికలంతా కలిసి ఆనందంగా వేడుక చేసుకుంటే ఎలా ఉంటుందో, ఆ సెట్లో పాట చిత్రీకరణ సమయంలో కూడా అలాంటి అనుభూతే కలిగింది. ఆర్ట్ డైరెక్షన్ అద్భుతంగా జరిగింది.
ఈ సినిమా కోసం నిర్మించిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్ నిజంగా ఆలయంలోకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది.
ఈ పాత్ర కోసం మీరు తీసుకున్న శిక్షణ లేదా జాగ్రత్తలు ఏంటి?
అభిషేక్ నామ గారు కథ చెప్పినప్పుడే నేను మెస్మరైజ్ అయ్యాను. ఆయన ప్రతి సీన్‌కు స్టోరీబోర్డ్ సిద్ధం చేసుకున్నారు. ప్రతి పాత్ర యాక్షన్, రియాక్షన్‌లను ముందుగానే స్కెచ్ చేసి రెడీ చేశారు. ఆయన ఈ కథను చాలా అద్భుతంగా ఊహించుకున్నారు. నా పాత్ర కోసం రెడీ అవ్వడానికి దాదాపు రెండు గంటలు పట్టేది. ప్రతి కాస్ట్యూమ్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఈ షూటింగ్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం చాలా అరుదుగా వస్తుంది.
ఇందులో మీ పాత్రలో రొమాన్స్ కూడా ఉంటుందా?
రొమాన్స్ ఉంటుంది. అయితే దానికంటే చాలా ముఖ్యమైన అంశాలు నా పాత్రలో ఉంటాయి. అవే కథకు కీలక మలుపు తీసుకొస్తాయి.
విరాట్ కర్ణ ఇప్పటివరకు ఒక్క సినిమా మాత్రమే చేశాడు. ఆయనతో నటించడం ఎలా ఉంది?
విరాట్ కర్ణ చాలా ప్యాషన్, డెడికేషన్ ఉన్న నటుడు. ఇది ఆయన రెండో సినిమా అని అనిపించదు. ఎంతో అనుభవం ఉన్న నటుడిలా నటించారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. విరాట్‌తో కలిసి నటించడం చాలా మంచి అనుభవం.
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత మీరు ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం?
నాకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. దాని వల్ల భుజానికి గాయం అయింది. ఆ కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు బ్రేక్ తీసుకున్నాను. ఫిజికల్‌గా, మెంటల్‌గా పూర్తిగా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే సినిమాలు చేయాలి. స్క్రీన్‌పై ఎనర్జీతో కనిపించినప్పుడే పాత్రకు న్యాయం చేయగలనని భావిస్తాను. అందుకే పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ నటించడం ప్రారంభించాను.
‘స్వయంభూ’లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు కదా?
అవునండి. ఇలాంటి రెండు భారీ చిత్రాల్లో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ రెండు కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూడదగ్గ సినిమాలు. అలాంటి రెండు చిత్రాల్లో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. ఒక నటిగా నాకు చాలా సంతృప్తిగా ఉంది.
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…