ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా “రంభ ఊర్వశి మేనక” సినిమా మొదటి లుక్ విడుదల చేశారు. పనిలో పనిగా విడుదల తేదీ కూడా ప్రకటించారు. సో, థియేటర్లలోకి రానున్న నరేష్ తదుపరి చిత్రం ఇదే. ఐతే, నరేష్ నటించిన ఆల్కహాల్ (Alcohol) అనే సినిమా గురించి ఏమి అప్డేట్ లేదా? ఆ ప్రశ్న అడగకముందు నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ ని విడుదల చేసింది.
అల్లరి నరేష్ కి హ్యాపీ బర్త్ డే చెప్తూ ఒక పోస్టర్ వచ్చింది. అందులో విడుదల ఎప్పుడు అనే క్లారిటీ లేదు.
నిజానికి ఈ సినిమాని జనవరి 1, 2026న విడుదల చేస్తామని ఏడాది క్రితం నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రకటించింది. కానీ ఆరు నెలల తర్వాత కూడా ఈ సినిమా కూడా విడుదల కాలేదు.
జనవరి 1, 2026 నుంచి జూన్ 30, 2026 వరకు మధ్యలో ఒక్కసారి కూడా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ రాలేదు. దాంతో హీరో సహా అందరూ మర్చిపోయారు. ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్ విడుదల చేసి మళ్ళీ గుర్తు చేశారు.
నరేష్ సినిమాలకు ఇప్పుడు మార్కెట్ లేకపోవడం, OTT సమస్యల కారణంగా ఈ సినిమా విడుదలకు నోచుకోవడం లేదా? మరేదైనా కారణం ఉందా?
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…