రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న వారణాసి (Varanasi)తో మొత్తం ప్రపంచవ్యాప్తంగా తన సత్తా ఏంటో చూపాలి అని రాజమౌళి పట్టుదలగా ఉన్నారు.
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న “వారణాసి”లో అటు అడ్వెంచర్, ఇటు రామాయణ సన్నివేశాలు ఉంటాయి. సైన్స్ ఫిక్షన్, పురాణాలు కలిసిన కథ ఇది. ఈ సినిమాతో గ్లోబల్ ఆడియెన్స్ ని ఆకట్టుకొని తన మార్కెట్ ని విస్తరించుకోవాలని భావిస్తున్నారు రాజమౌళి.
“బాహుబలి” సినిమాలతో ఉత్తర అమెరికా మార్కెట్ ని కొల్లగొట్టారు రాజమౌళి. ఇప్పుడు ఉత్తర అమెరికా మార్కెట్ లో “ధురంధర్” సినిమాలు కొత్త రికార్డులు నెలకొల్పాయి.
ఐతే, రాజమౌళి యూరోప్, లాటిన్ అమెరికా, చైనా, జపాన్, ఈస్ట్ ఏషియన్ మార్కెట్ లో కూడా తన సినిమాలు ఆడేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే, ఓవర్ సీస్ మార్కెట్ లో ఇప్పటి నుంచే “వారణాసి”కి తెగ ప్రచారం కల్పిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి ఫ్రాన్స్ లో ఉన్నారు అక్కడ తన బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలను ప్రదర్శించి రాబోయే సినిమా గురించి హడావిడి చేస్తున్నారు.
ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్న రాజమౌళి ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకు కళ్ళు చెదిరే అమౌంట్ అడుగుతున్నారట. అందుకే రెగ్యులర్ గా తెలుగుసినిమాలను మార్కెట్ చేసే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. హాలీవుడ్, అంతర్జాతీయ కంపెనీలు ఇక దిక్కు.
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…