తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో తన సన్నివేశాలను పూర్తిగా తొలగించారని నటి ఆనంది అజయ్ (Anandhi Ajay) భావోద్వేగానికి గురయ్యారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన ఓ వీడియోలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సినిమా కోసం తాను దాదాపు ఏడాది పాటు కష్టపడ్డానని చెప్పారు. విజయ్ చివరి చిత్రంలో ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందని, కానీ చివరకు తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ తొలగించడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపారు.
ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెకు మద్దతుగా స్పందిస్తున్నారు.
సెన్సార్ సూచనల మేరకు ‘జన నాయకుడు’ చిత్రంలో పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. సెన్సార్ బోర్డు మొత్తం 12 కీలక మార్పులను సూచించడంతో, ఆ ప్రక్రియలోనే ఆనంది సన్నివేశాలు తొలగించి ఉండొచ్చ అని అంటున్నారు. ఆ మాటకొస్తే హీరోయిన్ పూజ హెగ్డే సీన్లు కూడా చాలా కట్ చేశారు. సెకండాఫ్ లో ఒక రెండు సీన్లలో తప్ప పూజ కనిపించదు. హీరోయిన్ సీన్లే తీసేసినప్పుడు ఈ చిన్న నటి సీన్లు తొలగించడంలో ఆశ్చర్యం లేదు.
తమిళనాట విజయ్ కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. విజయ్ చివరి చిత్రంలో కనిపిస్తే తన కెరీర్ మలుపు తిరుగుతుందని భావించింది ఆనంది అజయ్. టీవీ నటిగా పేరున్న ఈ భామ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…