‘టాక్సిస్’ (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్ కె.నారాయణ. ఈ సినిమాలో రొమాన్స్ శృతిమించిందని, ఒక పాటకు మించి మరో పాటలో అందాల ఆరబోత కనిపిస్తోందంటూ విమర్శలు మొదలైన సంగతి తెలిసిందే.
సినిమాలోని కంటెంట్, మేకింగ్ చూస్తుంటే ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం కాదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ సినిమా మామూలుగా ఉండదని, థియేటర్లకు కేవలం పెద్దలు మాత్రమే రావాలని ఆయన ఓపెన్ గా చెబుతున్నాడు.
‘టాక్సిస్’ అనే టైటిల్ నుంచి తాజాగా రిలీజైన సాంగ్ వరకు ఇదే విషయాన్ని చెబుతున్నామని, అంతా అర్థం చేసుకోవాలని కోరారాయన. చిన్న పిల్లలు, సున్నిత మనస్తత్వం ఉన్నవారు తమ సినిమాకు దూరంగా ఉండాలని కూడా చెబుతున్నారు.
ఈ సినిమాలో కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి, తార సుతారియా వంటి అగ్ర కథానాయికలు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ అన్నీ సరికొత్త స్టైల్‌లో బోల్డ్ కంటెంట్‌తో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
త్వరలో రాబోయే మూడో పాటలో యష్, రుక్మిణి వసంత్ కనువిందు చేయబోతున్నారు.
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…