ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా ఒక భారీ పాన్ ఇండియా చిత్రం తెలుగు నుంచి విడుదల కానుంది. డ్రాగన్, వారణాసి, స్పిరిట్ ఈ మూడు చిత్రం గ్లోబల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని వచ్చే వేసవి సెలవుల్లో విడుదల చేస్తున్నారు. 2027 వేసవిలో మహేష్ బాబు,ఎన్టీఆర్, ప్రభాస్ చిత్రాలు విడుదలవుతాయి. అభిమానులకు, థియేటర్లకు పండగే పండుగ.
ప్రభాస్ ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేస్తున్నాడు. ‘ది రాజాసాబ్’ ఘోరమైన పరాజయం తర్వాత ‘ఫౌజీ’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలకు సిద్ధం చేసిన ఈ అగ్ర హీరో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై మాత్రం గట్టిగా దృష్టి పెట్టాడు. ‘స్పిరిట్’ చిత్రాన్ని మార్చి 2027లో విడుదల చెయ్యనున్నారు.
సమ్మర్ 2027లో మొదటి భారీ తెలుగు చిత్రం ఇదే. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యూత్ లో ఒక కల్ట్ ఇమేజ్ పొందారు. ఆయన తీస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు మరి. ఇక ఇది ప్రభాస్ కెరీర్ లో 25వ చిత్రం. ఏ రకంగా చూసినా ఈ సినిమా భారీ మూవీ.
రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. దానికి తగ్గట్లే షూటింగ్ ని వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ మొత్తానికి గుమ్మడికాయ కొడుతారు. రాజమౌళి దీన్ని అంతర్జాతీయ ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్నాడు. ఓవైపు సినిమా నిర్మాణంతో పాటు, మరోవైపు ప్రచార కార్యక్రమాల్ని సైతం కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఒక దఫా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృధ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి ఆస్కార్ వేదికపై మెరవాలనేది రాజమౌళి కల, అలాగే గ్లోబల్ మార్కెట్ ని చేజిక్కించుకోవాలని టార్గెట్ చేశారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే యాక్షన్ చిత్రం చేస్తున్నాడు మాస్ హీరో ఎన్టీఆర్. ఈ సినిమా విడుదలకు, ఇంతకుముందు మేకర్స్ అనుకున్న టైమ్ లైన్స్ సెట్ అవ్వకపోవడంతో 2026 జూన్ నుంచి 2027 జూన్ కి మార్చారు. జూన్ 11, 2027 ని ఇటీవల ఈ సినిమాకి డేట్ లాక్ చేశారు. ఎన్టీఆర్, నీల్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ అతిపెద్ద సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇటీవల విడుదల చేసిన నాలుగు నిమిషాల వీడియో గ్లిమ్ప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా… ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నాయి.
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…