న్యూస్

Pooja Hegde: ఆమెకి కత్తెర వేశాను, దర్శకుడి వ్యాఖ్యలు వైరల్

తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన ‘జన నాయకుడు’ (తమిళంలో ‘జన నాయగన్’) ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. ఇంతకుముందు వీరు జంటగా ‘బీస్ట్’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ మరోసారి జోడీ కట్టడం విశేషం.

అయితే దర్శకుడు హెచ్. వినోత్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తొలుత పూజా హెగ్డే కోసం జర్నలిస్టు పాత్రను విస్తృతంగా రాశామని, కానీ షూటింగ్ పరిమితులు, అనంతరం ఎడిటింగ్‌లో నిడివి సమస్యల కారణంగా అనేక సన్నివేశాలను తొలగించాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. దీంతో ఆమె పాత్ర అనుకున్నంత బలంగా తెరపై కనిపించలేదని అంగీకరించారు. ఈ సందర్భంగా పూజాకు క్షమాపణ కూడా చెప్పారు.

ముఖ్యంగా సెకండాఫ్‌లో పూజా హెగ్డే కనిపించే సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలోనే ఉంటాయని టాక్.

ఇదిలా ఉంటే, పూజా హెగ్డేకు బాక్సాఫీస్ పరంగా చెప్పుకోదగ్గ విజయం వచ్చి చాలా కాలం అయింది. మరి ‘జన నాయకుడు’ ఆమె కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

Recent Posts

విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi

హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…

9 minutes ago

Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ

ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…

6 hours ago

Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్

టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…

6 hours ago

Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం

హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…

1 day ago

నాగవంశీకే డేట్ పాటించాలని చెప్పిన Akkineni Nagarjuna

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…

1 day ago

పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni

రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…

2 days ago