
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన ‘జన నాయకుడు’ (తమిళంలో ‘జన నాయగన్’) ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించింది. ఇంతకుముందు వీరు జంటగా ‘బీస్ట్’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ మరోసారి జోడీ కట్టడం విశేషం.
అయితే దర్శకుడు హెచ్. వినోత్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తొలుత పూజా హెగ్డే కోసం జర్నలిస్టు పాత్రను విస్తృతంగా రాశామని, కానీ షూటింగ్ పరిమితులు, అనంతరం ఎడిటింగ్‌లో నిడివి సమస్యల కారణంగా అనేక సన్నివేశాలను తొలగించాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. దీంతో ఆమె పాత్ర అనుకున్నంత బలంగా తెరపై కనిపించలేదని అంగీకరించారు. ఈ సందర్భంగా పూజాకు క్షమాపణ కూడా చెప్పారు.
ముఖ్యంగా సెకండాఫ్‌లో పూజా హెగ్డే కనిపించే సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలోనే ఉంటాయని టాక్.
ఇదిలా ఉంటే, పూజా హెగ్డేకు బాక్సాఫీస్ పరంగా చెప్పుకోదగ్గ విజయం వచ్చి చాలా కాలం అయింది. మరి ‘జన నాయకుడు’ ఆమె కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
