పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె పేరు మరో బడా ప్రాజెక్ట్ లో వినిపిస్తోంది.
ఆ ప్రాజెక్ట్ పేరు…ఓజీ 2 (‘OG 2’).
అవును ఆమెని పవన్ కళ్యాణ్ సరసన నటింపచేసే ఆలోచనలో ఉన్నారట. ఓజీ మొదటి భాగంలో ప్రియాంక మోహన్ నటించింది. ఆ సినిమాలో ఆ పాత్ర చనిపోయింది. అంటే రెండో భాగంలో ప్రియాంక మోహన్ కనిపించే ఛాన్స్ లేదు. అందుకే మరో కొత్త పాత్రలో మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డేని తీసుకుంటారు అని అంటున్నారు.
ప్రస్తుతం సుజీత్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. సంగీత దర్శకుడు తమన్ కూడా తన పని మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ కి చెందిన నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
కానీ పూజ హెగ్డే నిజంగానే ఈ సినిమాలో నటిస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేం.
ప్రస్తుతం ఈ భామ తెలుగులో దుల్కర్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. తమిళ్ లో ఒక సినిమా ఉంది. ఇక ఆమె విజయ్ తో నటించిన “జన నాయగన్” ఇంకా విడుదలకు నోచుకోలేదు.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…