సాధారణంగా మే నెల వేసవి సెలవుల కాలానికి చాలా కీలకం. అసలైన కలెక్షన్లు మేలోనే వస్తాయి. కానీ 2025లో సీన్ రివర్స్ అయింది. పెద్ద హీరోల చిత్రం ఒక్కటీ విడుదల కాలేదు. విడుదలైన వాటిలో నాని నటించిన “హిట్ 3″నే బడా చిత్రం. ఇక విడుదలైన సినిమాల్లో కేవలం ఒక్క సినిమానే హిట్ గా నిలిచింది. మరోటి యావరేజ్ అనిపించుకొంది.
హిట్ ఇదే
శ్రీ విష్ణు హీరోగా నటించిన “సింగిల్” సినిమా అనుకోకుండా విజయం సాధించింది. ఈ సినిమాకి టైం కలిసొచ్చింది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చాయి. కామెడీ వర్కవుట్ అయింది. దాంతో పెట్టిన పెట్టుబడికి మించి వసూళ్లు వచ్చాయి. సినిమా హిట్ అనిపించుకొంది.
యావరేజ్
భారీ అంచనాల మధ్య వచ్చిన “హిట్ 3” మొదటి రోజు భారీ వసూళ్లు పొందింది. కానీ ఆ తర్వాత డీలా పడింది. తెలంగాణాలో ఈ సినిమా హిట్, ఆంధ్రాలో నష్టాలను మిగిల్చింది. అమెరికాలో కూడా ఫ్లాప్ (2.3 మిలియన్ డాలర్ల వసూళ్లు పొందింది కానీ డిస్ట్రిబ్యూటర్ కొన్న అమౌంట్ ఎక్కువ). వసూళ్ల ఫిగర్ భారీగా ఉన్నా ఓవరాల్ వసూళ్ల పరంగా చూస్తే ఇది యావరేజ్ చిత్రం.
సో సో
సమంత నిర్మించిన “శుభం” థియేటర్లలో నిలబడలేదు. అమెరికాలో పెట్టిన పెట్టుబడి వచ్చింది. ఇది సో సో మూవీ.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…