చిరంజీవి కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరధ్వాజ్ మృతి చెందాడు. అతడి వయసు 39 సంవత్సరాలు. కొన్నాళ్లుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు శిరీష్. పరిస్థితి మరింత క్షీణించడంతో శిరీష్ మరణించాడు.
చాలా ఏళ్ల కిందట శ్రీజ-శిరీష్ భరధ్వాజ్ ప్రేమ వ్యవహారం ఓ సంచలనం. ఇంట్లో చెప్పకుండా ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ టైమ్ లో తనకు ప్రాణహాని ఉందంటూ శ్రీజ సంచలన ఆరోపణ చేశారు. దాంతో ఒక దశలో పవన్ కల్యాణ్, తన లైసెన్సెడ్ రివాల్వర్ ను పోలీసులకు అప్పగించారు.
అలా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఓ కూతురు పుట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వాళ్లు విడిపోయారు. విడిపోయిన తర్వాత శ్రీజ, కల్యాణ్ దేవ్ ను పెళ్లాడారు. అటు శిరీష్ కూడా ఐదేళ్ల కిందట ఓ డాక్టర్ ను పెళ్లి చేసుకొని చెన్నైలో సెటిల్ అయ్యాడు.
అయితే కొంతకాలంగా లంగ్స్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నాడు శిరీష్. అది మరింత సీరియస్ అవ్వడంతో అతడ్ని హాస్పిటల్ లో చేర్చారు. అయితే అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది, గుండెపోటుతో శిరీష్ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…