నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లికి రెడీ అవుతోంది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో ఈమె నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెళ్లికి ముహూర్తం దగ్గర పడింది.
ప్రస్తుతం తన పెళ్లి శుభలేఖలు పంచే పనిలో వరలక్ష్మి బిజీగా ఉంది. తండ్రి శరత్ కుమార్, పిన తల్లి రాధికతో కలిసి కొంతమంది ప్రముఖులకు స్వయంగా తనే శుభలేఖలు అందిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లెజెండ్ కమల్ హాసన్, దర్శకుడు బాల లాంటి ప్రముఖులకు శుభలేఖలు అందాయి.
వచ్చేనెల 2న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు వరలక్ష్మి-నికొలాయ్. ఆ తర్వాత చెన్నైలో సినీ రాజకీయ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
39 ఏళ్ల వరలక్ష్మి, నికొలాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. నికొలాయ్ కు మాత్రం ఇది మొదటి పెళ్లి కాదు. అతడికి ఆల్రెడీ పెళ్లయి, భార్యకు విడాకులిచ్చాడు. ఇప్పుడు వరలక్ష్మిని పెళ్లాడుతున్నాడు.
కేవలం డబ్బు కోసమే నికొలాయ్ ను పెళ్లాడుతున్నాననే పుకార్లను వరలక్ష్మి తీవ్రంగా ఖండించింది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…