మొన్నటివరకు కోలీవుడ్ లో సుడిగాలి పర్యటన చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు టాలీవుడ్ లో విస్తృతంగా పర్యటిస్తోంది. దీనికి కారణం ఆమె పెళ్లి. తన వివాహానికి అందర్నీ ఆహ్వానించేందుకు వరలక్ష్మి ఇలా కష్టపడుతోంది.
తమిళనాట కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి ప్రముఖులతో పాటు చాలామందికి శుభలేఖలు అందించిన వరలక్ష్మి.. ప్రస్తుతం హైదరాబాద్ లో పలువురు సెలబ్రిటీల్ని కలుస్తోంది. అడివి శేష్, ప్రశాంత్ వర్మ, సమంత, గోపీచంద్ మలినేని, రవితేజ, తమన్, మురళీ శర్మ.. ఇలా ఎంతోమందిని పర్సనల్ గా కలిగి శుభలేఖలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వచ్చేనెల 2న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు వరలక్ష్మి-నికొలాయ్. ఆ తర్వాత చెన్నైలో సినీ రాజకీయ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. సెలబ్రిటీస్ అంతా రిసెప్షన్ కే వస్తారు.
39 ఏళ్ల వరలక్ష్మి, నికొలాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. నికొలాయ్ కు మాత్రం ఇది మొదటి పెళ్లి కాదు. అతడికి ఆల్రెడీ పెళ్లయి, భార్యకు విడాకులిచ్చాడు. ఇప్పుడు వరలక్ష్మిని పెళ్లాడుతున్నాడు.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…