‘పెద్ది’ (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు చాలామంది హీరోయిన్లు దీనిపై స్పందిస్తున్నారు. ఇప్పుడు కంగనా రనౌత్ (Kangana Ranaut) కూడా ఈ లిస్టులోకి చేరిపోయింది.
బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రం చుట్టూ అల్లుకున్న ఈ వివాదం ఈ హీరోయిన్ల వల్ల రోజురోజుకు ముదురుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్రను చూపించిన విధానంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పుడీ విమర్శల పరంపరలోకి కంగనా కూడా చేరింది.
సినిమాల్లో మహిళలను కేవలం ఒక వస్తువులా చూపించే ధోరణిపై కంగనా స్పందించింది.సాధారణంగా తను ఒక సినిమాకు అంగీకరించినప్పుడు రకరకాల కోణాల్లో ఆలోచిస్తానని, ఎక్కడైనా తేడా కొడితే “ఇది ఇలా అనిపిస్తోంది” అని దర్శకులకు ముందే చెప్తానని అంటోంది కంగనా.
అయితే ఇదే టైమ్ లో మేకర్స్ ను కూడా వెనకేసుకొచ్చింది కంగనా. ఏ దర్శకుడూ కావాలని మహిళలను తక్కువ చేసి చూపించడానికి సినిమాలు తీయరని ఆమె అభిప్రాయపడింది. ఇలాంటి విషయాల్లో చిత్రనిర్మాతలతో మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడింది.
చాలా మంది పురుష రచయితలు కథ రాసుకున్నప్పుడు, మహిళా కోణంలో దాన్ని ఆలోచించలేకపోవచ్చని.. ఓ మహిళగా మన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పినప్పుడు… “మేము ఈ కోణంలో ఆలోచించలేదు, మీరు చెప్పింది నిజమే” అని వారు కూడా ఒప్పుకుంటారని అంటోంది కంగన. చూస్తుంటే, తప్పంతా జాన్వీదే అన్నట్టున్నాయి కంగనా వ్యాఖ్యలు.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…