రానా నటిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. అటు నాని నటించిన ‘నిన్ను కోరి’ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయింది. ఎవరి సినిమా ప్రమోషన్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. కానీ సేమ్ టైం ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ తమ స్నేహాన్ని చాటుకుంటున్నారు.
‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కు యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రతి ఒక్కరు టీజర్ బాగుందని, రానా లుక్ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. ఈ మూవీకి మరింత హైప్ తీసుకొచ్చే పని చేశాడు నాని. “మీరు టీజర్ మాత్రమే చూశారు. నేను ట్రయిలర్ కూడా చూశా. అది కూడా రిలీజ్ అయితే రచ్చ రచ్చే. ట్రయిలర్ బ్రహ్మాండంగా ఉంది.” రానా కొత్త సినిమాపై నాని ట్వీట్ ఇది. సేమ్ టైం రానా కూడా ‘నిన్నుకోరి’ లాంటి సబ్జెక్ట్ నాని కోసమే పుట్టిందంటున్నాడు.
వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్. రియల్ ఫ్రెండ్సిప్ వీరిది. తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్ కు యాంకర్లుగా కూడా వర్క్ చేశారు. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ తమ మధ్య ఎలాంటి ఇగోస్ లేవని అందరి ముందు ప్రూవ్ చేసుకున్నారు. భవిష్యత్తులో ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…