ఈ హీరో మంచి భోజనప్రియుడు అనే విషయం సినీప్రియులందరికీ తెలుసు. తన భోజన ప్రియత్వాన్ని మరోసారి చాటుకున్నాడు నారా రోహిత్. “శమంతకమణి” షూటింగ్ బ్రేక్ లో యూనిట్ సభ్యుల కోసం ఏకంగా చేపల పులుసు వండి వార్చాడు.
శమంతకమణి సినిమాలో పోలీస్ పాత్ర చేస్తున్నాడు నారా రోహిత్. అదే గెటప్ తో గరిట పుచ్చుకున్నాడు. మసాలాలు అన్నీ మిక్స్ చేసి ఎంచక్కా చేపల పులుసు వండేశాడు. చివర్లో ఎలా వచ్చందో చూద్దామని తనే చేతిలో వేసుకొని రుచి కూడా చూశాడు. ఈ మొత్తం ఎపిసోడ్ ను శమంతకమణి యూనిట్ పనిలో పనిగా తమ సినిమా ప్రచారానికి కూడా వాడేస్తోంది.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నలుగురు హీరోలు నటిస్తున్న విషయం తెలిసిందే. నారా రోహిత్ తో పాటు ఆది, సుధీర్ బాబు, సందీప్ కిషన్ ఇందులో హీరోలు. వీళ్లలో ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. శమంతకమణి అనే కారు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఓ కీలక పాత్రలో రాజేంద్రప్రసాద్ కూడా కనిపించనున్నాడు. మరి ఈ చేపల పులుసు ప్రచారం శమంతకమణికి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…