గుండెపోటు తర్వాత సుస్మిత సలహా


సుష్మిత సేన్ కి 47 ఏళ్ళు. చాలా ఫిట్ గా ఉంటుంది. సాధారణంగా ఆడవాళ్ళలో హార్ట్ అటాక్ సమస్యలు తక్కువ. వీటిని బట్టి సుష్మిత సేన్ కి గుండెపోటు వచ్చిందంటే ఆశ్చర్య పడక ఉండలేం. ఐతే, ఫిట్ నెస్ వల్లే తాను బతికి బయటపడ్డాను అంటోంది సుష్మిత.

రక్తనాళాలు మూసుకుపోయిన మాట వాస్తవమే కానీ నిత్యం ఎక్సర్ సైజ్ చెయ్యడం వల్లే స్టెంట్ తో సరిపోయింది అని చెప్తోంది. అందుకే ప్రతి ఒక్కరూ నిత్యం రన్నింగో, వాకింగో, యోగానో, ఎదో ఒక వ్యాయామం చెయ్యాలి అని ఆమె సలహా ఇస్తోంది.

“చాలా మంది అనుకుంటున్నారు. ఎప్పుడూ ఎక్సర్ సైజ్ చేసే సుష్మితకే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇక జిమ్ కి ఎందుకు వెళ్లాలని. కానీ అది తప్పు. ఫిట్ గా ఉండడం వల్లే తొందరగా కోలుకున్నాను,” అని తెలిపింది సుష్మిత.

అలాగే అందరూ ఎప్పటికప్పుడూ హెల్త్ చెకప్ చేసుకోవాలి అని కోరుతోంది. ఈ చెకప్ ల వల్ల ముందే సమస్యని పసిగట్టే అవకాశం ఉందని చెప్తోంది సుష్మిత సేన్.

Advertisement
 

More

Related Stories