సూపర్ స్టార్ రజినీకాంత్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ధనుష్ కి జాతీయ ఉత్తమనటుడిగా అవార్డు ప్రదానం ఒకేసారి, ఒకే వేదికపై జరిగింది. సరిగ్గా మూడు నెలల క్రితమే జరిగిందిది. ఆ రోజు తండ్రి, భర్త కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ … they are mine అని కామెంట్ పెట్టారు ఐశ్వర్య.
జనవరి 17న విడిపోతున్నట్లు ప్రకటించారు ధనుష్, ఐశ్వర్య. మూడు నెలల క్రితం వరకు ఆనందంగా కనిపించిన ఈ జంట ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మూడు నెలల్లోనే ఏమైంది?
ఐతే, కోలీవుడ్ సమాచారం వేరుగా ఉంది. ధనుష్, ఐశ్వర్య మధ్య విబేధాలు ఇప్పటివి కావు. చాలాసార్లు వీరి మధ్య గొడవలు జరిగాయట. రజినీకాంత్ కోసమే కలిసి ఉన్నారనేది మాట. రజినీకాంత్ వీరిని కలిసి ఉంచారు అని అంటున్నారు. ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయింది అని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి విడిపోతున్నారట.
ఇప్పుడు ధనుష్ జాతీయ స్థాయి హీరో. హిందీలో పలు సినిమాలు చేశారు ధనుష్. తెలుగులో ‘సార్’ అనే సినిమాతో ఎంట్రీ షురూ. హాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో నటిస్తున్నారు. సినిమాకి దాదాపు 25 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి రావడం విశేషం. చేతిలో ఉన్న సినిమాలే దాదాపు 200 కోట్ల రూపాయలను తెచ్చిపెట్టాయి. అంటే, అతని స్థాయి పెరిగింది. అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.
రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఆ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో ఒక నోట్ రాశారు. అది చదివితే కొంత అర్థమవుతుంది.
“Marriage is carrying each other’s baggage ( literally too most often in my case !) Compassion stays way beyond passion
Friendship becomes the base of companionship… House is always home ..”
(పెళ్లి అనేది ఒకరి మానసిక బరువులను మరొకరు మోయడమే. నా విషయంలో అది మరింత నిజం. అర్థం చేసుకునే గుణమే మిగతా అన్నిటి కన్నా మిన్న. కలిసి ఉండడానికి స్నేహమే ప్రధానకారణం అవుతుంది. ఇల్లే ఎప్పటికీ మన సొంత స్థలం.)
Samantha’s upcoming film "Maa Inti Bangaaram" is showing promising signs at the North American box…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Rashi Singh has…
Veteran filmmaker Singeetham Srinivasa Rao has revealed that "Pushpa 2" and "Kantara" are the two…
Keerthy Suresh appears to be regaining momentum in Telugu cinema with a couple of high-profile…
The makers of Vijay Deverakonda’s much-awaited period action drama "Ranabaali" have unveiled the first look…
Actress and television host Vishnu Priya Bhimeneni has once again become a talking point on…