దసరా బరిలో నిలవాల్సిన ‘అఖండ’ దీపావళికి వచ్చేలా ఉంది. “అఖండ” షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఐతే, రెండో వేవ్, ఆంధ్రాలో టికెట్ రేట్ల వ్యవహారం వంటి కారణాల వల్ల ఇప్పటివరకు విడుదల చెయ్యలేదు. ఐతే, ఇంకా ఎక్కువకాలం ఆగితే… రిలీజ్ డేట్స్ దొరకడం కష్టం అవుతుందనే ఉద్దేశంతో దీపావళికి విడుదల చెయ్యాలని నిర్మాత భావిస్తున్నారట.
డిసెంబర్ లో “పుష్ప”, “ఆచార్య” సినిమాలు, సంక్రాంతికి “ఆర్ ఆర్ ఆర్”, రాధేశ్యామ్ పోటీలో ఉన్నాయి. ఈ ఏడాది డేట్ మిస్ చేసుకుంటే మళ్ళీ 2022 వేసవి వరకు ఆగాలి. సో.. దీపావళి వైపు మొగ్గు చూపుతున్నారని టాక్.
ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక పాట బయటికి వచ్చింది. తమన్ స్వరపరిచిన రొమాంటిక్ డ్యూయెట్ అది. బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ పై తీశారు.
ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారు. బోయపాటి మార్క్ యాక్షన్ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ నెల రోజుల పాటు తీశారు.
Sreeleela began her acting career at a very young age, making her screen debut while…
Ravi Teja and Sree Vishnu are all set to share screen space in an upcoming…
Anil Ravipudi remains one of the busiest and most sought-after directors in Telugu cinema. With…
Mrunal Thakur appears to be going through a relatively quiet phase, both professionally and personally.…
Kiran Abbavaram's upcoming romantic drama “Chennai Love Story” has completed its censor formalities, with the…
Ravi Teja has started dubbing for his upcoming emotional family drama “Irumudi,” directed by Shiva…