ఈ నెల 26న ‘అయలాన్’ రాక

తెలుగు ప్రేక్షకులకు శివ కార్తికేయన్ బాగా తెలుసు. ఇటీవలే “ప్రిన్స్”గా తెలుగులో నటించాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘అయలాన్’ సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైంది. కానీ తెలుగునాట నాలుగు తెలుగు చిత్రాలు విడుదల కావడంతో ఈ సినిమా పండుగ వేళ మన దగ్గర విడుదల కాలేదు.

ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చెయ్యనున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయట. అయలాన్ అంటే ఏలియన్. బాలీవుడ్ లో ఏలియన్ ప్రధాన పాత్రలో సినిమాలు వచ్చాయి కానీ దక్షిణాదిలో ఇదే మొదటిసారి.

ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించారు.

”హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని విధంగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చూపించాలని ఈ నెల 26న ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం” అని చెప్పారు నిర్మాత రాజేష్.

TeluguCinema

TeluguCinema

  • News

The Odyssey: Christopher Nolan to attend Mumbai premiere

Acclaimed Hollywood filmmaker Christopher Nolan is set to visit Mumbai next month to promote his…

28 minutes
  • News

Tamannaah Bhatia rejects ‘Choli Ke Peeche’ remix?

Tamannaah Bhatia has emerged as one of the most sought-after performers for special songs in…

1 hour
  • News

Priyanka Chopra becomes Rolex brand ambassador

Priyanka Chopra continues to strengthen her position as one of India's most valuable celebrity endorsers.…

2 hours
  • News

Raaka: Speculation grows over a possible glimpse video

Allu Arjun’s "Raaka" has been progressing quietly, far away from the usual buzz of the…

2 hours
  • News

Maa Inti Bangaaram glitters in North America with Pre-sales

Samantha’s upcoming film "Maa Inti Bangaaram" is showing promising signs at the North American box…

14 hours
  • Video

Video: Rashi Singh dazzles in a glamorous way in red Saree

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Rashi Singh has…

14 hours