అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ షూటింగ్ చివరి దశకు చేరుకొంది. డిసెంబర్ 17న సినిమా విడుదల చెయ్యాలనేది ప్లాన్. మరోవైపు, తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ ఇంతవరకు అనౌన్స్ చెయ్యలేదు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ‘ఐకాన్’ ఉంటుందని ఆ మధ్య హడావిడి నడిచింది. కానీ ఆ సినిమా గురించి ఇంతవరకు అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. సో… దాని స్టేటస్ ఏంటో చూడాలి.
ఇక ‘సరైనోడు’ బోయపాటి తనకి సరైన దర్శకుడే అని బన్ని ఫిక్స్ అయ్యాడు కానీ సినిమా అనౌన్స్ మెంట్ విషయంలో తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. బోయపాటితో మూవీ గురించి ఇప్పుడే చెప్పలేం కానీ మూవీ ఉంటుందని ఇటీవల బన్నీ మిత్రుడు బన్నీవాసు చెప్పారు.
అసలు విషయం ఏంటంటే… ‘అఖండ’ విడుదలయిన తర్వాత దాని రిజల్ట్ ని బట్టి ఒక నిర్ణయం తీసుకుందామని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు టాక్.
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘అఖండ’పై భారీ అంచనాలున్నాయి. కానీ, ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. క్రిస్మస్ కి రిలీజయ్యే ఛాన్స్ ఉంది. సో… అప్పటి వరకు ఆగాలి అని భావిస్తున్నాడు అల్లు అర్జున్. ఇంతకీ, అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది కరెక్ట్ గా తేలాలంటే మరో రెండు నెలలు ఆగాలి.
Actress and television host Vishnu Priya Bhimeneni has once again become a talking point on…
Speculation surrounding Ram Charan’s future projects continues to dominate Tollywood circles, but sources indicate that…
“Srinivasa Mangapuram" introduces Jaya Krishna Ghattamaneni, the grandson of Superstar Krishna, to the Telugu film…
Deepika Padukone played the central female lead in director Nag Ashwin’s blockbuster "Kalki 2898 AD."…
Kiara Advani remains optimistic about her pan-Indian biggie, "Toxic", despite the film witnessing multiple postponements.…
Samantha attended the pre-release event of "Maa Inti Bangaram" along with her husband, Raj Nidimoru.…