సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో భారీ పోటీ కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సినిమాలు పోటీలో నిలిచాయి. ప్రస్తుతానికైతే 5 ఫిక్స్, ఏదీ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. మరి ఇలాంటి టైమ్ లో డబ్బింగ్ సినిమాల పరిస్థితేంటి?
దీనికి సంబంధించి దిల్ రాజు ఇప్పటికే ప్రకటన చేశారు. స్ట్రయిట్ సినిమాలకే దిక్కు లేదు, డబ్బింగ్ సినిమాలకు ఎక్కడ్నుంచి థియేటర్లు దొరుకుతాయంటూ ఓపెన్ గా రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో, సంక్రాంతి బరి నుంచి ఓ డబ్బింగ్ సినిమా తప్పుకుంది.
ధనుష్ హీరోగా నటిస్తున్న “కెప్టెన్ మిల్లర్” సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం లేదు ఈ సినిమాను తమిళ్ తో పాటు కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో సంక్రాంతికి ఈ సినిమాను తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకురాలేదు. దీంతో తెలుగు మినహా, మిగతా భాషల్లో “కెప్టెన్ మిల్లర్”ను విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాలో ధనుష్ తో పాటు తెలుగు హీరో సందీప్ కిషన్, కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటించారు. హీరోయిన్ గా ప్రియాంక మోహన్ చేసింది. ఇలా మంచి స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, థియేటర్లు దొరక్క తెలుగు రిలీజ్ ను తాత్కాలికంగా పక్కనపెట్టారు.
The teaser of “Oh..! Sukumari,” starring Thiru Veer and Aishwarya Rajesh, has been unveiled, offering…
The announcement of "OG 2", the sequel to the blockbuster "OG", came as a pleasant…
Netflix has secured the digital streaming rights of "Sing Geetham", the latest film from veteran…
Akhil Akkineni’s "Lenin" appears to be facing yet another setback. The film, which was scheduled…
Fresh off the blockbuster success of “Mana Shankara Vara Prasad Garu” with Chiranjeevi, director Anil…
Gopichand’s next film has been officially titled “Singa.” Produced by Vijay Chilla and Shashi Devireddy…