బాలీవుడ్ లో ముద్దుల హీరో అంటే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చే పేరు ఇమ్రాన్ హష్మి. ఇప్పుడంటే కాస్త తగ్గాడు కానీ, ఒకప్పుడు లిప్ కిస్సులు లేకుండా ఇమ్రాన్ సినిమాలు ఉండేవి కావు. అలా కిస్సులతో పాపులరైన ఈ హీరో, ఇప్పుడు మళ్లీ హీరో వేషాలు షురూ చేశాడు.
నితిన్ కక్కర్ దర్శకత్వంలో ‘ఆవారాపన్ 2’ రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. బ్యాంకాక్ లో మొదలైన ఈ షూటింగ్ లో ఇమ్రాన్ తో పాటు హీరోయిన్ దిశా పటానీ కూడా జాయిన్ అయింది.
బ్యాంకాక్ లో సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో దాదాపు 50శాతం షూటింగ్ పూర్తిచేస్తారు. అప్పట్లో ‘ఆవారాపన్’ పెద్ద మ్యూజికల్ హిట్. దానికి ఏమాత్రం తీసిపోని విధంగా సీక్వెల్ లో సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ సినిమాతో టాలీవుడ్ కు విలన్ గా పరిచయమౌతున్నాడు ఇమ్రాన్ హష్మి. అంతలోనే బాలీవుడ్ లో హీరోగా కొత్త ప్రాజెక్టు లాంచ్ చేశాడు. ఈ రెండు పడవల ప్రయాణాన్ని అతడు ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి.
ahesh Babu has taken a brief break from the shooting of S.S. Rajamouli’s much-awaited globe-trotting…
Vijay Deverakonda recently announced that his period action drama “Ranabaali” will hit theaters on September…
Superstar Rajinikanth is all set to begin work on his 173rd film (Thalaivar173), and the…
The title "Megastar" has been synonymous with Chiranjeevi for decades. For many fans, especially those…
Director Sukumar attended the grand success celebrations of Ram Charan’s “Peddi” in Hyderabad on Tuesday.…
Actress Trisha has finally put an end to the speculation surrounding her relationship with Vijay…