ఇటీవల తన సినిమాలన్నింటిలో తన కుటుంబానికి చెందిన గీతా ఆర్ట్స్ లేదా తన మిత్రులు, బంధువులనో ఇరికిస్తున్నారు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమా లాభాల్లో కొంత తన మిత్రులకు వెళ్తుంది. ‘అల వైకుంఠపురంలో’ సగం లాభాల్లో గీతా అర్త్స్ తీసుకొంది… ఆ సినిమాలో పార్ట్నర్ గా ఉండి.
ఇప్పుడు ‘ఐకాన్’ అనే సినిమాలో కూడా గీతా ఆర్ట్స్ సంస్థని ఇరికించే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నారు. దిల్ రాజుది పెద్ద బ్యానర్. అయినా కూడా గీతా ఆర్ట్స్ కి నిర్మాణంలో భాగస్వామ్యం కల్పిస్తున్నాడని టాక్. అల్లు అరవింద్, దిల్ రాజు ఇప్పటికే హిందీలో ‘జెర్సీ’ రీమేక్ కలిసి నిర్మిస్తున్నారు. సో, ‘ఐకాన్’లో కూడా పార్ట్నర్ షిప్ కి దిల్ రాజు ఒప్పుకుంటారా అన్నది చూడాలి.
ఈ ‘ఐకాన్’ సినిమాని రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఇన్నాళ్లకు దానికి మోక్షం లభించింది. శ్రీరామ్ వేణుకి ఒక విధంగా అదృష్టమే అని చెప్పాలి. ఆగిపోయింది అనుకున్న ‘ఐకాన్’ మళ్ళీ మొదలుకావడం అంటే లక్కే కదా.
ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్, అక్టోబర్ లో మొదలు కావొచ్చు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు నటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో బన్నీ గుడ్డివాడుగా కనిపిస్తాడట.
Director M.S. Raju's mystic divine thriller “Agadha” is all set for a worldwide theatrical release…
Despite earlier announcements, Akhil Akkineni's “Lenin” will not have premiere shows in the Telugu states.…
Payal Rajput is the latest Telugu actress to introduce a paid subscription option for her…
There was a time when Alia Bhatt was regarded as the biggest female star in…
Priyamani has built a reputation as one of the most versatile actresses in Indian cinema.…
Actress Swathi Reddy aka Colors Swathi has married director Srikanth Nagothi. She shared the happy…