అటు డుమ్మా, ఇటు కత్తెర

“గేమ్ ఛేంజర్” సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలకు అస్సలు హాజరు కాలేదు కియారా అద్వానీ. అప్పటికే ఆమె గర్భవతి. అందుకని ఆమె ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన “గేమ్ ఛేంజర్” సినిమా ప్రమోషన్లకు డుమ్మా కొట్టింది. కియారా అద్వానీ నటించిన మరో బడా చిత్రం… వార్ 2. ఈ సినిమా ఈ వారమే విడుదల అవుతోంది. ఈ ఈవెంట్స్ కి కూడా ఆమె రావట్లేదు.

కియారా అద్వానీ ఇటీవల ఒక పాపకు జన్మనిచ్చింది. పిల్ల తల్లి కాబట్టి బయటి ఈవెంట్స్ కి రాలేదు. అందుకని ఆమె రెండు బడా చిత్రాల్లో నటించినా రెండింటి ప్రమోషన్స్ కి రాలేకపోయింది.

మరోవైపు, ఈ సినిమాలో ఆమె మొదటిసారిగా బికినిలో కనిపించింది. సినిమాల్లో బికినీలో అగుపించడం ఇదే మొదటిసారి ఆమెకి. ఈ సినిమా ట్రైలర్ లో, టీజర్లో ఆమె బికినీ విజువల్స్ ని ప్రముఖంగా చూపించింది “వార్ 2” టీం. అంతే కాదు “బిహిండ్ ది షూటింగ్” పేరుతో ఆమె బికినీ సీన్ మేకింగ్ వీడియో కూడా ఇటీవల విడుదల చేశారు మేకర్స్.

కానీ సినిమాలో మాత్రం బికినీ డోస్ చాలా వరకు ఉండదు. ఎందుకంటే, సెన్సార్ బోర్డు మోతాదు మించిన ఎక్స్ పోజింగ్ అంటూ కత్తెర వేసింది.

“వార్ 2” సినిమాలో కియరా అద్వానీ హృతిక్ రోషన్ కి జోడిగా నటించింది. ఆమెపై రెండు పాటలు చిత్రీకరించారు.

TeluguCinema

TeluguCinema

  • News

Ram Charan to meet Telugu media post release of Peddi

With premiere shows of “Peddi” set to begin across Andhra Pradesh and Telangana from 8…

11 hours
  • News

FWICE lifts ban against Bollywood star Ranveer Singh

Bollywood star Ranveer Singh no longer faces a non-cooperation directive from FWICE (Federation of Western…

12 hours
  • News

Honey Rose refuses to be part of Chiranjeevi’s film?

One of the more surprising rumors currently doing the rounds in Film Nagar is that…

13 hours
  • News

Kriti Sanon reveals the sacrifices behind her bikini look

Kriti Sanon has become the talk of the town following the launch of the trailer…

15 hours
  • News

Irumudi Glimpse: Ravi Teja as a father and Ayyappa devotee

After predominantly starring in mass entertainers and action dramas in recent years, Ravi Teja is…

17 hours
  • News

Hairstylist shares picture from Prabhas’s Spirit sets

Prabhas is currently busy shooting for Spirit, directed by Sandeep Reddy Vanga. The film is…

17 hours