బిగ్ బాస్ హౌజ్ లో లాస్య సేఫ్ గేమ్ అడిందనే విషయం అందరికీ తెలిసిందే. ఎవ్వరినీ నొప్పించక, తానొవ్వక రోజులు గడిపేసింది. చాలా సార్లు ఎలిమినేషన్ నుంచి తప్పంచుకున్న ఈ మాజీ యాంకర్.. తప్పనిసరి పరిస్థితుల మధ్య తాజాగా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా లాస్య తన సేఫ్ గేమ్ వదల్లేదు.
బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి బయటకొచ్చిన వాళ్లంతా ఫుల్ ఓపెన్ అయిపోయారు. కంటెస్టెంట్లపై తమ అభిప్రాయాల్ని ఓపెన్ గా చెప్పేశారు. అంతేకాదు, విన్నర్ గా ఎవరు నిలుస్తారనే అంశంపై కూడా రియాక్ట్ అయ్యారు. అయితే లాస్య మాత్రం బయటకొచ్చిన తర్వాత కూడా సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది.
బిగ్ బాస్ బజ్ తో పాటు పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్న లాస్య.. ఎవ్వరిపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. అందరూ మంచోళ్లే అనే విధంగా మాట్లాడుతోంది. బయటకొచ్చిన తర్వాత మొదటి రోజు అభిజిత్ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన లాస్య.. ఇప్పుడు అతడి గురించి కూడా మాట్లాడ్డం మానేసింది. అందరూ సూపర్ అంటోంది.
మరోవైపు హౌజ్ లో బయటపెట్టిన తన వ్యక్తిగత విషయాలపై స్పందిస్తూ.. అవన్నీ నిజాలేనని, షో కోసం అబద్ధాలు ఆడలేదని స్పష్టంచేసింది లాస్య. కేవలం షో కోసం కాకుండా.. తను గురించి ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలనే ఉద్దేశంతో వాటిని బయటపెట్టినట్టు వెల్లడించింది.
Superstar Mahesh Babu has heaped praise on Satyadev-starrer “Rao Bahadur”, which he is presenting through…
All is set for “OG 2.” Putting an end to months of speculation, Pawan Kalyan…
This Friday (June 26) will be an unusual one for Telugu cinema. Instead of new…
Ghattamaneni Krishna, fondly known as Superstar Krishna, built his career on courage. He was a…
Malayalam star and filmmaker Prithviraj Sukumaran, who made his Telugu debut with “Salaar” and is…
Veteran actor Kamal Haasan on Wednesday announced “Dharman” as a producer, with Superstar Rajinikanth playing…