వర్రీ అవుతోన్న లవ్ స్టోరీ నిర్మాతలు


‘లవ్ స్టోరీ’ సినిమా ఎప్పుడో విడుదల కావాలి. కానీ అనేక కారణాల వల్ల ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఎందుకంటే… పాటలు వైరల్ అయ్యాయి. పైగా, సాయి పల్లవి ఉంది. నాగ చైతన్య – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వస్తోన్న మొదటి సినిమా.

దీనిపై భారీగా అంచనాలు ఉన్న మాట వాస్తవమే కానీ ఈ సినిమా హీరో నాగ చైతన్య వ్యక్తిగత జీవితం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దాంతో ‘లవ్ స్టోరీ’ ప్రెస్ మీట్ పెడితే ఆయన స్టోరీ అడుగుతారు మీడియా వాళ్ళు. అది సమస్య. ఈ నెలాఖరులో కానీ, వచ్చే నెలలో కానీ ‘లవ్ స్టోరీ’ విడుదల డేట్ ఫిక్స్ అయితే నాగ చైతన్య మీడియా ముందుకు రావడం డౌటే. అందుకే, నిర్మాతలు వర్రీ అవుతున్నారట. సినిమా విడుదల మరింత ఆలస్యం ఐతే మాత్రం ఆ సమస్య ఉండదు.

‘లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్ ని ప్రస్తుతం ఆపేశారు. సినిమా విడుదల తేదీ ఖరారు అయిన తర్వాతే మళ్ళీ ప్రమోషన్ మొదలు పెడుతారు.

శేఖర్ కమ్ముల ఇంతకుముందు తీసిన ‘ఫిదా’ సంచలన విజయం సాధించింది. దాంతో, ఆ అంచనాలు అందుకునేందుకు కమ్ముల మరింత కష్టపడి తీశాడు. సినిమా బాగా వచ్చిందని పాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సినిమాకి ఇతర సమస్యలే అడ్డంకిగా మారాయి.

TeluguCinema

TeluguCinema

  • News

Love, action drive ‘Srinivasa Mangapuram’ trailer

The makers of Srinivasa Mangapuram have unveiled the film's theatrical trailer, offering a glimpse into…

4 hours
  • News

Ranabaali: Rashmika shares working still, says She can’t wait to watch it

Actress Rashmika Mandanna has offered fans an exciting behind-the-scenes glimpse from the sets of “Ranabaali,”…

5 hours
  • News

Priyadarshi’s ‘Idupu Kayitham’ eyes December 2026 release

Idupu Kayitham, starring Priyadarshi in the lead role, is gearing up for a theatrical release…

5 hours
  • News

AP CM Chandrababu Naidu visits Pawan Kalyan after shoulder surgery

Actor and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan is recovering after undergoing a successful…

7 hours
  • OTT

Sundeep Kishan’s Netflix ‘Super Subbu’ struggles to get online chatter

Netflix's Telugu original series "Super Subbu," starring Sundeep Kishan in the lead role, premiered about…

10 hours
  • News

Dhurandhar fails to make impressive debut in Japan

After rewriting box office records in India and North America, Bollywood blockbuster “Dhurandhar” made its…

10 hours