బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరొందారు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఆయన నటించిన మొదటి తెలుగు చిత్రం… “సైంధవ్.”
“తెలుగులో నటించాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. మొదటి సినిమాలోనే వెంకటేష్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టం. ‘సైంధవ్’లో దర్శకుడు శైలేష్ ఒక కొత్త తరహా పాత్ర సృష్టించారు. ఆయన ఆ పాత్ర క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడే చెయ్యాలని ఫిక్స్ అయ్యాను. తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పుకున్నా,” అని నవాజుద్దీన్ తెలిపారు.
“చాలా తెలుగు సినిమాలు చూశాను. వెంకటేష్ గారు హిందీలో నటించిన “అనారి” సినిమా కూడా చూశాను. ఆయన చేసిన చాలా చిత్రాలు చూశాను కాబట్టే వెంకీతో మూవీ అంటే ఎగిరి గంతేసా,” అని నవాజుద్దీన్ చెప్పారు.
టాలీవుడ్, బాలీవుడ్ వర్కింగ్ స్టైల్ లో కొన్ని తేడాలు ఉన్న మాట వాస్తవమే అని అంగీకరించారు నవాజుద్దీన్. “ఇక్కడ టైం సెన్స్ బాగా పాటిస్తారు. అది నచ్చింది నాకు,” అని చెప్పారు.
Samantha recently made headlines while offering relationship advice to women, stating that they should be…
Rajamouli had initially planned to shoot key sequences of his ambitious film “Varanasi”, starring Mahesh…
Superstar Mahesh Babu has heaped praise on Satyadev-starrer “Rao Bahadur”, which he is presenting through…
All is set for “OG 2.” Putting an end to months of speculation, Pawan Kalyan…
This Friday (June 26) will be an unusual one for Telugu cinema. Instead of new…
Ghattamaneni Krishna, fondly known as Superstar Krishna, built his career on courage. He was a…