హీరో ఎన్టీఆర్ జీవితంలో ఒక సూత్రం పాటిస్తాడట. “కుంగ్ ఫు పండా” చిత్రంలో గ్యాంగ్ మాస్టర్ ఉగ్వే (Oogway) చెప్పిన డైలాగ్ తన జీవిత గమనానికి మార్గదర్శి అయింది అని అంటున్నారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ తాజాగా “ఎస్క్వేర్ ఇండియా” మేగజైన్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక మేగజైన్ కవర్ పేజీకి ఎన్టీఆర్ ఫోటోషూట్ చెయ్యడం ఇదే మొదటిసారి. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడారు. కానీ అందులో బాగా నచ్చిన అంశం మాత్రం తాను జీవితంలో పాటించే సూత్రం గురించి చెప్పడమే.
ALSO READ: NTR graces his first magazine cover
“నిన్న అనేది ఒక ముగిసిన చరిత్ర, రేపు అనేది తెలియని విషయం. ఈ రోజే నిజమైన బహుమతి. అందుకే దాన్ని ప్రెజెంట్ అంటారు. Yesterday is history, tomorrow is a mystery, but today is a gift. That is why it is called the present. పండా సినిమాలో ఈ కొటేషన్ నాకు బాగా గుర్తిండిపోయింది. దాన్ని నేను నిజజీవితంలో కూడా పాటిస్తా. రేపటి గురించి ప్రణాళికలు వేసుకోవడం, అయిపోయినదాని గురించి అతిగా ఆందోళన చెందను. ఇప్పటి గురించే ఆలోచిస్తా,” అని ఎన్టీఆర్ వివరించారు.
ఎన్టీఆర్ ఫిలాసపీ బాగుంది కదూ. ఆయన అభిమానులు కూడా అక్కరికి రాని ట్రైలర్ వ్యూస్ రికార్డులు అని, ఇదని హడావిడి చేయకుండా నేటి గురించి ఆలోచిస్తే బాగుంటుంది.
Veteran filmmaker M. S. Raju says his upcoming thriller “Agadha” is one of the most…
Landing a role alongside Megastar Chiranjeevi is a dream opportunity for many actresses, and Ashika…
The makers of “Aadarsha Kutumbam” have officially unveiled Srinidhi Shetty's character from the film. After…
Anna Konidala, the wife of Andhra Pradesh Deputy Chief Minister and actor Pawan Kalyan, has…
Veteran Telugu actress Pavala Shyamala, known for her character roles and impeccable comic timing, passed…
Actor NTR has suffered a shoulder injury and has been advised complete rest for six…