నిర్మాత ఆదిత్య చోప్రాని , దర్శకుడు అయాన్ ముఖర్జీని ఎన్టీఆర్ గుడ్డిగా నమ్మినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆదిత్య చోప్రాకి ఆడియెన్స్ పల్స్ బాగా తెలుసు అనే ఉద్దేశంతో, వాళ్ళ టీం చెప్పిన మాటలను ఎన్టీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. అందుకే “వార్ 2” సినిమా టీజర్ కి ట్రోలింగ్ వచ్చినా, పాటలు పెద్దగా వెళ్లకపోయినా, “కూలీ” సినిమాకి అమెరికాలో భారీ అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నా… తన సినిమా విడుదల తర్వాత అన్నీ మార్చేస్తుంది అని నమ్మారు.
“దేవర” సినిమా విడుదల సమయంలో కూడా చాలా నెగెటివిటీ వినిపించింది. అయినా ఆ సినిమాని తన స్టార్డం హిట్ చేసింది కదా అని కూడా భావించినట్లు అనిపిస్తోంది.
అందుకే, ఎప్పుడూ లేనిది స్టేజిపై కాలర్ ఎగిరేశాడు. హృతిక్ రోషన్ కూడా కాలర్ ఎగిరేసేలా చేశాడు. “వార్ 2” కచ్చితంగా ఆడుతుంది అనే బలమైన నమ్మకంతోనే ఎన్టీఆర్ ఇలా చేసినట్లు చెప్పొచ్చు.
కానీ సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద పవర్ ఫుల్ వ్యక్తి అయినా ఏ సినిమా ఆడుతుందో కచ్చితంగా చెప్పలేరు. రాజమౌళి కూడా “బాహుబలి” విడుదల తర్వాత మూడు రోజుల వరకు కూడా ఆ సినిమా పెద్ద హిట్ అని నమ్మలేదు. సినిమా గట్టెక్కితే చాలు అని అనుకున్నారు.
కాబట్టి సినిమా మీద ఎంత నమ్మకం ఉన్నా మీడియా ముందు, జనం ముందు శృతి మించి కామెంట్స్, ఓవర్ గా చెయ్యకూడదు. అలా చేసి విజయ్ దేవరకొండ ఎక్కువ ట్రోలింగ్ అయి ఇప్పుడు కెరీర్ ని ప్రమాదంలో పడేసుకున్నాడు. ఎన్టీఆర్ చాలా పెద్ద స్టార్. అలాంటి హీరో అలా చెయ్యకుండా ఉండాల్సింది. కాలర్ ఎగిరెయ్యడం వల్లే సినిమా పెద్దగా ఆడడం లేదు అనడం లేదు కానీ ట్రోలింగ్ ఇంత ఉండేది కాదు.
Malayalam star and filmmaker Prithviraj Sukumaran, who made his Telugu debut with “Salaar” and is…
Veteran actor Kamal Haasan on Wednesday announced “Dharman” as a producer, with Superstar Rajinikanth playing…
Looking for the latest Telugu movie release schedule for 2026? This page provides a regularly…
Nandamuri Balakrishna and director Koratala Siva have officially joined hands for the first time. Their…
Priyadarshi has commenced work on his new film as a lead actor. Titled “Idupu Kayitham,”…
Harsh Roshan’s upcoming film “Thella Kaagitham” has kickstarted its musical promotions with the release of…