8 భాషల్లో ప్రభాస్ మూవీ!

ప్రభాస్ ని మొన్నటి వరకు పాన్ ఇండియా స్టార్ అన్నారు. కొన్నాళ్లుగా ఆయన సినిమాలన్నీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్నాయి. కానీ, ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ గా మారుతున్నట్లు కనిపిస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్న చాలా దేశాల మార్కెట్ పై కన్నేశారు ప్రభాస్.

‘బాహుబలి’ సినిమాతో ఇప్పటికే ప్రభాస్ కి జపాన్ మార్కెట్ లో కొంత పట్టు వచ్చింది. ఇప్పుడు చైనా, కొరియా వంటి ఇతర మార్కెట్స్ పై కూడ పట్టు సాధించాలని అనుకుంటున్నాడు. ప్రభాస్, సందీప్ వంగా కాంబినేషన్ లో ‘స్పిరిట్’ అనే సినిమాని తాజాగా ప్రకటించారు. ఇది ప్రభాస్ కెరీర్ లో 25వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాని మొత్తంగా ఎనిమిది భాషల్లో విడుదల చెయ్యనున్నారు.

సినిమాని ఈ రోజు (అక్టోబర్ 7)న ప్రకటించారు. ఈ పోస్టర్ లోనే ఎనిమిది భాషల పేర్లు వేశారు. ఇది 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న నాలుగు చిత్రాలు లైన్ లో ఉన్నాయి. అందులో ‘రాధే శ్యామ్’ వచ్చే సంక్రాంతికి విడుదల అవుతుంది. ఆ తర్వాత మరో మూడు సినిమాలు విడుదల కావాలి. అవి: ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే. ఈ మూడు కాకుండా ఇంకో మూవీ కూడా చేస్తాడు ప్రభాస్. ఆ తర్వాత ‘స్పిరిట్’ వస్తుంది.

TeluguCinema

TeluguCinema

  • News

Actress Varalaxmi Sarathkumar calls Vijay’s rise to CM ‘destiny’

Actress Varalaxmi Sarathkumar recently met Tamil Nadu Chief Minister Vijay and shared pictures from the…

2 hours
  • News

AP Governor Abdul Nazeer calls on Pawan Kalyan after shoulder surgery

Andhra Pradesh Deputy Chief Minister and actor Pawan Kalyan is recovering at his Hyderabad residence…

3 hours
  • News

Is Sreeleela on a spree of losing big projects in Tamil and Telugu?

Sreeleela appears to be going through a difficult phase in her career, with reports suggesting…

4 hours
  • News

Sai Rajesh explains why Vaishnavi Chaitanya was replaced

Director Sai Rajesh has once again addressed the casting change in Chennai Love Story, indirectly…

4 hours
  • News

Korean Kanakaraju: Varun Tej does mass dance number with Daksha Nagarkar

Daksha Nagarkar appears in another mass number in Telugu cinema. The makers of Varun Tej's…

4 hours
  • News

Aishwarya Rajesh: I’d love to do an ‘Obsession’-type movie

Versatile actress Aishwarya Rajesh says she is now looking to explore darker and more challenging…

5 hours