దర్శకుడు సుజీత్ ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు. ‘సాహో’ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా తనకు మంచి ఆఫర్ దక్కిందన్నాడు. అయితే అది ‘ఓజీ’ కాదు, రామ్ చరణ్ సినిమా.
అవును.. ‘సాహో’ తర్వాత రామ్ చరణ్ సినిమా ఆఫర్ వచ్చిందంట. చరణ్ తో ఓ స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయాలనుకున్నాడట సుజీత్. పూర్తిగా లండన్ బ్యాక్ డ్రాప్ లో ఆ మూవీ ప్లాన్ చేశాడటం.
అయితే కరోనా కారణంగా ఆ ప్రాజెక్టు సాకారం కాలేదని, అప్పట్నుంచి మెగా కాంపౌండ్ లో ఎంట్రీ కోసం ఎదురుచూస్తుంటే, ఊహించని విధంగా పవన్ ఆఫర్ వచ్చిందన్నాడు.
నిజానికి పవన్ తో సినిమాపై కూడా ఆశలు వదులుకున్నాడట సుజీత్. ఎందుకంటే, ముందుగా ఓ రీమేక్ చేయాలని ప్రపోజ్ చేశారంట. దానికి సుతారంగా నో చెప్పిన తర్వాత ఇక ఛాన్స్ మిస్సయిందనుకున్నాడట. అంతలోనే మరో కథ ఉంటే తీసుకురమ్మని కోరడం, ఆ వెంటనే ‘ఓజీ’ ఫైనల్ అవ్వడం చకచకా జరిగిపోయాయంట.
‘ఓజీ’ కథను సుజీత్ తనకు పొడిపొడిగా మాత్రమే చెప్పాడని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై సుజీత్ స్పందించాడు. తను ఎవరికైనా పొడిపొడిగా మాత్రమే చెబుతానని. డీటెయిల్డ్ గా కథ చెప్పడం కష్టమని అన్నాడు.
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Rashi Singh was busy…
The success of "Maa Inti Bangaaram" has turned even more special for Samantha. Megastar Chiranjeevi…
Vadde Naveen was one of the stars of the 1990s in Telugu film industry. Though…
The iconic mystery franchise "Marmadesam" is making a comeback with a new chapter, "Veerabhadruni Rahasyam…
Kajal Aggarwal has shared exciting details about her role in NBK111, the upcoming action entertainer…
At a time when even big-budget and star-driven films are finding it difficult to secure…