రవితేజతో సమంత నటిస్తుందా?

సమంత మళ్ళీ నటించడం మొదలుపెట్టింది. ఆమె తాజాగా “మా ఇంటి బంగారం” అనే సినిమాలో నటిస్తోంది. ‘ఓ బేబీ’ దర్శకురాలు నందిని రెడ్డి తీస్తున్న కొత్త సినిమాలో నటిస్తోంది సమంత.

ఐతే ఈ భామ మరికొన్ని సినిమాల్లో కూడా నటించాలని భావిస్తోందట. తాజాగా దర్శకుడు శివ నిర్వాణ ప్లాన్ చేస్తున్న సినిమాలో ఆమె నటించే అవకాశం ఉంది.

రవితేజ ప్రస్తుతం “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే సినిమాలో నటిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం తర్వాత శివ నిర్వాణ తీసే సినిమాలో నటించే అవకాశం ఉంది. శివ నిర్వాణ తన గత రెండు చిత్రాల్లో సమంతనే హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆ చిత్రాలు ఏవంటే… మజిలీ, ఖుషి. ఇప్పుడు మూడోసారి కూడా సమంతకే మొదటి ఓటు అంటున్నాడట.

రవితేజ, సమంత ఇప్పటివరకు కలిసి నటించలేదు. సమంత ఈ 15 ఏళ్లలో దాదాపు అందరి హీరోలతో నటించింది కానీ రవితేజతో జోడిగా చెయ్యలేదు. ఇప్పుడు ఆమెకి 38 ఏళ్ళు. సో, వయసు పరంగా చూసినా రవితేజకి సరైన జోడిగా ఉంటుంది.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

TeluguCinema Team

  • News

Ashika Ranganath waits for Chiranjeevi’s Vishwambhara after two-year delay

Landing a role alongside Megastar Chiranjeevi is a dream opportunity for many actresses, and Ashika…

49 minutes
  • News

Srinidhi Shetty introduced as Swarna in Trivikram’s Aadarsha Kutumbam

The makers of “Aadarsha Kutumbam” have officially unveiled Srinidhi Shetty's character from the film. After…

2 hours
  • News

Pawan Kalyan’s wife requests fans: ‘Please call me Anna Konidala’

Anna Konidala, the wife of Andhra Pradesh Deputy Chief Minister and actor Pawan Kalyan, has…

3 hours
  • News

Pavala Shyamala passes away at 75; dies in penury

Veteran Telugu actress Pavala Shyamala, known for her character roles and impeccable comic timing, passed…

4 hours
  • News

NTR suffers shoulder injury, advised six to eight weeks of rest

Actor NTR has suffered a shoulder injury and has been advised complete rest for six…

16 hours
  • News

Bomma Bomma from Sri Sri: Dulquer Salmaan and Pooja Hegde’s chemistry shines

Actor Dulquer Salmaan is making his return to Telugu cinema with Sri Sri, where he…

17 hours