దర్శకుడు శివ నిర్వాణ ఇప్పటివరకు మూడు చిత్రాలు తీశారు. మొదటిది …నిన్ను కోరి. అది మ్యూజికల్ హిట్. రెండోది…మజిలీ. ఇది కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్. ఈ రెండు చిత్రాలకు పాటలు ఇచ్చింది మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్. ఐతే, ‘మజిలీ’ సినిమా రీ-రికార్డింగ్ టైంలో శివ నిర్వాణకి గోపి సుందర్ కి చిన్న అభిప్రాయభేదాలు వచ్చాయి. దాంతో, ఆ సినిమాకి నేపథ్య సంగీతం (బ్యాక్ గ్రౌండ్ స్కోర్) తమన్ తో చేయించుకున్నాడు.
అలాగే, ఇప్పుడు మూడో చిత్రం తీశాడు శివ నిర్వాణ. ‘టక్ జగదీష్’ పేరుతో నాని హీరోగా తీసిన ఈ మూవీకి తమన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. తమన్ పాటలు ఇచ్చాడు. ఈ సారి తమన్ తో సమస్య వచ్చినట్లుంది. అందుకే, ఈ సినిమాకి నేపథ్య సంగీతం (బ్యాక్ గ్రౌండ్ స్కోర్) తమన్ చెయ్యలేదు. గోపి సుందర్ తో చేయించుకున్నాడు.
ఈ రోజు ‘టక్ జగదీష్’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో తమన్, గోపిసుందర్ ఇద్దరి పేర్లు ఉన్నాయి. అలా, తమన్, గోపి సుందర్ స్థానాలు రెండు సినిమాలకు మారాయి.
‘టక్ జగదీష్’ సినిమా ఈ నెల 10న అమెజాన్ లో విడుదల కానుంది. ఈ ట్రైలర్ పై లుక్ వేయండి.
Nandamuri Balakrishna is currently busy shooting for his upcoming film, tentatively titled NBK111, under the…
Samantha is back in style. Her comeback film "Maa Inti Bangaaram" has emerged as a…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Amritha Aiyer may not…
“OG 2”, the much-awaited sequel to “OG”, has taken a step forward. The team at…
Janhvi Kapoor has once again become the subject of social media chatter, this time because…
The much-awaited collaboration between Venkatesh Daggubati, Nandamuri Kalyan Ram, and director Anil Ravipudi is all…