ఇటీవల జరిగిన “వారణాసి” సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి చేసిన కొన్ని వ్యాఖ్యలపై వివాదం రేగింది. ఈవెంట్ లో జరిగిన సాంకేతిక తప్పులకు దేవుడిని నిందించిన రాజమౌళిపై చర్యలు తీసుకోవాలని తాజాగా కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హనుమంతుడిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలని రాష్ట్రీయ వానరసేన సంఘం తప్పు పట్టింది. రాజమౌళిఫై చర్యలు తీసుకోవాలంటూ సరూర్ నగర్ పోలీసులకు ఈ వానరసేన సంఘం లిఖితపూర్వక ఫిర్యా దు అందించింది. ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడిన క్లిప్పింగులను కూడా పోలీసులకు అందించింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఇంతవరకు స్పందించలేదు.
అసలు ఏమి జరిగింది అంటే… గత శనివారం (నవంబర్ 15) రాజమౌళి “వారణాసి” సినిమా టైటిల్ ని ప్రకటించారు. అలాగే భారీ తెరపై సినిమాకి సంబంధించిన వీడియోని ప్రదర్శించారు. ఐతే, ఈ వీడియో మొదట ప్లే కాలేదు. సాంకేతిక సమస్యలతో స్క్రీన్ మొరాయించింది. దాంతో రాజమౌళి అసహనానికి గురయ్యారు. తన భార్య రామ హనుమంతుడి భక్తురాలి అని, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆ హనుమంతుడే అన్ని చూసుకొని తమని నడిపిస్తాడని అన్నారని చెప్పారు.
కానీ ఇలా (సాంకేతిక సమస్యలు) జరగడం ఏంటి, హనుమంతుడు ఇలా చేస్తాడా అన్నట్లుగా రాజమౌళి మాట్లాడారు. దాంతో హనుమంతుడి భక్తులు నోచుకున్నారు. “మీ వెర్రి చేష్టలు వేసి, మీ టీం సరిగా పని చెయ్యక హనుమంతుడిని నిందిస్తారా” అంటూ ఆంజనేయస్వామి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొదట సోషల్ మీడియా వేదికగా రాజమౌళిని ట్రోల్ చేశారు. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Nandamuri Balakrishna and director Koratala Siva have officially joined hands for the first time. Their…
Priyadarshi has commenced work on his new film as a lead actor. Titled “Idupu Kayitham,”…
Harsh Roshan’s upcoming film “Thella Kaagitham” has kickstarted its musical promotions with the release of…
Actress Samantha Ruth Prabhu has confirmed that she will be taking a break from films…
Samantha Ruth Prabhu says the theatrical success of “Maa Inti Bangaaram” has come as a…
Pooja Hegde has surprised fans with a dramatic makeover. The actress, known for her long…