15 ఏళ్ల క్రితం విక్రమ్ కి మాములు అభిమానులు ఉండేవారు కాదు. సౌత్ ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకున్న హీరో అతను. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’ చిత్రాల తర్వాత తెలుగునాట కూడ విక్రమ్ కి యమా క్రేజ్ పెరిగింది. ఒక పదేళ్ల పాటు విక్రమ్ హవా నడిచింది. కానీ, ‘ఐ మనోహరుడు’ తర్వాత విక్రమ్ సినిమా ఒక్కటీ ఆడలేదు.
తమిళనాట కూడా విక్రమ్ క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. ఆయన నుంచి హిట్ వచ్చి చాలా కాలమే అయింది. ఇప్పుడు ఆయన కొడుకు ధృవ్ కూడా హీరో అయ్యాడు. దాంతో, విక్రమ్ హీరోగా తన సినిమాలను తగ్గించుకున్నాడు. తాజాగా కొడుకు ధృవ్ తో కలిసి ‘మహాన్’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల కానుంది.
విక్రమ్ సినిమాలను భారీ మొత్తాలకు కొనే పరిస్థితి లేదు. థియేటర్లో ఆయన సినిమాలు ఆడట్లేదు. అందుకే, కొడుకుతో కలిసి నటించిన సినిమాని కూడా ఓటిటికి ఇచ్చేశాడు.
జనరల్ గా ఒక పెద్ద హీరో, ఆయన కొడుకు కలిసి నటించిన మొదటి సినిమా అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. బయ్యర్లు ఎగబడి కొంటారు. కానీ, విక్రమ్ కి ఇప్పుడు అలాంటి క్రేజ్ లేదు. అందుకే, థియేటర్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడం లేదు. ఇక, హీరోగా ఆయన వైభవం ముగిసింది అని అంటున్నారు విశ్లేషకులు.
Superstar Rajinikanth has begun work on his next film, “Dharman”, which is being directed by…
Ram Charan-starrer “Peddi” has almost completed its theatrical run. The actor is currently in the…
Singer Sunitha has issued a clarification after facing heavy criticism over her recent remarks. Her…
Rajamouli’s “Baahubali”, released in 2015, created a landmark in Indian cinema and changed the scale…
Samantha recently made headlines while offering relationship advice to women, stating that they should be…
Rajamouli had initially planned to shoot key sequences of his ambitious film “Varanasi”, starring Mahesh…