ఎల్లుండి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆగస్టు 22న తన కొత్త చిత్రం సినిమా టైటిల్ ఏంటో చెప్తాను అని ఇటీవలే దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఆయన ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా, నయనతార హీరోయిన్ గా సినిమా తీస్తున్నారు. సంక్రాంతికి విడుదల చెయ్యాలనేది ప్లాన్. కానీ అది సాధ్యం అవుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఎల్లుండి టైటిల్ మాత్రం ప్రకటించబోతున్నారు.
ఐతే, ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న “విశ్వంభర” చిత్రం సంగతి ఏంటి? ఈ సినిమా విడుదల ఉంటుందా లేక సినిమాని పక్కన పెట్టారా?
ఈ విషయంలో కూడా క్లారిటీ రేపు కానీ, ఎల్లుండి కానీ వస్తుంది. చిరంజీవి పుట్టిన రోజు పురస్కరించుకొని రేపు రాత్రే “విశ్వంభర” కొత్త పోస్టర్ ని విడుదల చెయ్యనున్నారు. ఈ పోస్టర్ లో విడుదల తేదీ ఉంటుంది అనే టాక్. నిజంగా రిలీజ్ డేట్ ప్రకటిస్తారా లేదా అనేది చూడాలి.
“విశ్వంభర” సినిమాకి దర్శకుడు వశిష్ఠ. అతను ఇంతకుముందు “బింబిసార” చిత్రం తీసి విజయం అందుకున్నాడు. రెండో చిత్రంగా చిరంజీవితో ఛాన్స్ దక్కింది. ఈ సినిమాని మొదట జనవరి 9, 2025న విడుదల చేద్దామనుకున్నారు. కానీ, తన కొడుకు సినిమా “గేమ్ ఛేంజర్” కోసం చిరంజీవి తన సినిమాని వాయిదా వేశారు. అలా సంక్రాంతికి రామ్ చరణ్ సినిమా విడుదల కాగా, చిరంజీవి మూవీ సమ్మర్ కి వాయిదా పడింది.
ఐతే, “విశ్వంభర” టీజర్ కి నెగెటివ్ కామెంట్స్ రావడం, గ్రాఫిక్స్ చీప్ గా ఉన్నాయి అని జనం అనడంతో సినిమాని సమ్మర్ నుంచి కూడా వాయిదా వేశారు. గ్రాఫిక్స్ ని మరింత గ్రాండ్ గా చేయిస్తున్నారు. దాంతో, ఈ సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదు.
ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది. మరో హీరోయిన్ గా ఆషిక రంగనాథ్ నటిస్తుండగా, బాలీవుడ్ భామ మౌని రాయ్ ఐటెం సాంగ్ చేసింది.
Actor Akhil Akkineni has revealed that he will soon become a full-time Indian citizen. Akhil,…
Nara Rohithi is celebrating his birthday today. Extending birthday wishes to Rohith, the makers of…
Kajal Aggarwal's latest Hindi film, The India Story, has got off to a disappointing start…
Shruti Haasan has once again made it clear that she is tired of being asked…
Rukmini Vasanth has emerged as one of the most sought-after actresses following the pan-India success…
Kiran Abbavaram and Sri Gouri Priya's "Chennai Love Story" has taken a strong start at…