సినిమా ఇండస్ట్రీలో రచయితలు పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. ప్రత్యేక గుర్తింపు కోసం ఇంకా ఎక్కువ తంటాలు పడాలి. తక్కువ టైంలోనే డైలాగ్ రైటర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న రచయిత లక్ష్మి భూపాల. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఓ బేబీ’ వంటి హిట్ చిత్రాల తర్వాత రైటర్ గా బిజీ అయిపోయారు లక్ష్మి భూపాల.
ఐతే, ఆయనకు ఇప్పుడు ‘ఘోస్ట్ రైటర్ల’ బెడద మొదలైందట. ఆయన దగ్గర పనిచేశామంటూ ఇండస్ట్రీలో కొందరు రచయితలు తిరుగుతున్నారట. దాంతో, ఆయన దర్శక, నిర్మాతలను అలెర్ట్ చేశారు. తన దగ్గర ఎవరూ ఘోస్ట్ రైటర్లు లేరని, తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
ఆయన పోస్ట్ యధాతథంగా….
దర్శకనిర్మాతల్లారా.. నిర్మకదర్శాతల్లారా..
నా దగ్గర అసిస్టెంట్ రచయితగా పనిచేశానని, నాకే తెలీకుండా నా దగ్గర ఘోస్ట్ దెయ్యం రైటర్ గా పనిచేశానని ఈమధ్య కొందరు మార్కెట్లో ఏ మాత్రం సిగ్గులేకుండా నా పేరు విచ్చలవిడిగా వాడేస్తున్నట్టు తెల్సింది.. ఇది మొదటిసారి కాదు.. వాళ్ళని నిలువునా తోలుతీసి ఉప్పూకారం రాసే మంచితనం నా దగ్గరున్నా నన్నెవరూ నిజానిజాలు అడగలేదు కాబట్టి నేను కూడా చెప్పలేదు.. ఇప్పుడు ఏకంగా నా అసిస్టెంట్ అని చెప్పుకుంటూ కొందరు కొన్నిచోట్ల అడ్వాన్స్ లు కూడా తీసుకున్నారని తెలిసింది.. వాడెలా రాస్తాడో చూడాలిగానీ, అలా చెప్తే ఎలా డబ్బులిచ్చారని నేను అడిగితే “మీ దగ్గర పనిచేసాడన్న నమ్మకం” అన్నారు.. ఇది చాలా పెద్ద తిట్టు నాకు.. కాబట్టి ఇప్పుడు తప్పడం లేదు..
నేను సినిమాల్లో మాటలు, పాటలు రాయడానికి ఇప్పటివరకు కేవలం నా బుర్రని తప్ప ఇంకెవరి సహాయం తీసుకోలేదు, ఒక్క అసిస్టెంట్ కూడా లేడు, ఇకముందు కూడా ఆ అవసరం లేదు.. ఎందుకంటే నిర్మాత, దర్శకుడు నన్ను, నా బుర్రని నమ్మి డబ్బులిస్తారని నేను నమ్ముతాను కాబట్టి.. అసిస్టెంట్లను పెట్టుకునే ఇతర రచయితల ఇబ్బందులు నాకు తెలీదు కాబట్టి వారి విషయంలో నేను మాట్లాడలేను.
ఇక నా పేరు వాడుకుంటున్న దరిద్రులకు ప్రేమగా ఒక అభ్యర్ధన..”అమ్మలారా.. అయ్యాలారా.. ఇకముందు మీరు ఇలాంటి మోసాలు, కక్కుర్తి ఎదవపనుల కోసం నా పేరు వాడినట్టు నాకు తెలిస్తే మాత్రం…… మీ తల్లిదండ్రుల, మీ భార్యాబిడ్డల, మీ స్నేహితుల చెప్పుల్తో కొట్టించి టీవీ లైవ్ పెట్టించి మరీ సన్మానించబడును.. నీ స్వార్ధం కోసం పక్కోడి పేరుని వాడుకోవడం కంటే అంగమార్పిడి చేయించుకోవడం మంచిది..”
దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి.. ఎందుకంటే…. నా కేరాఫ్ నేను మాత్రమే.. నాకెక్కడా బ్రాంచీల్లేవ్..
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Anjali made a…
Actress and politician Khushbu Sundar has strongly reacted to criticism she received on social media…
A casual remark made by veteran actor Y. G. Mahendran during a YouTube interview has…
Mahesh Babu has been fully occupied with Rajamouli's ambitious project "Varanasi," which is currently in…
Rashmika Mandanna is gearing up for another major project. The actress, who was recently seen…
Director Rajamouli, who is currently in France, recently interacted with fans of his films "RRR"…